సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎప్పుడు ఎవరు ఎలా ప్రేమలో పడతారో ? కూడా ఎవ్వరికి తెలియదు. ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీల మధ్య ప్రేమలు, డేటింగ్లు, పెళ్లిళ్లు.. అలాగే చివరకు విడాకులు కూడా కామన్ అయిపోయాయి. కొందరు అయితే ఏకంగా ఇద్దరు ముగ్గురికి కూడా విడాకులు ఇవ్వడాలు, సహజీవనాలు చేయడాలు కామన్‌గా పెట్టుకున్నారు. అయితే కొందరు మాత్రమే తమ జీవితంపై ఎన్ని వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లు అని ఫ్రూవ్ చేస్తూ తమ వైవాహిక జీవితాన్ని బలంగా మార్చుకుంటూ ఉంటారు.
అలాంటి సినిమా సెలబ్రిటీల జంటే దర్శకుడు కృష్ణవంశీ – క్రేజీ హీరోయిన్ రమ్యకృష్ణది. కృష్ణవంశీ తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందారు. నిన్నేపెళ్లాడతా సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో అందరిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఇక రమ్యకృష్ణ నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తోంది. ఈ వయస్సులో కూడా బాహుబలి సినిమాలో శివగామి లాంటి దేశం గర్వించే పాత్రలో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.
రమ్యకృష్ణ సౌత్ సినిమా పరిశ్రమను రెండు దశాబ్దాలు ఏలేసింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారు. ఇక నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్రలేఖ సినిమా వచ్చింది. ఇషా కొప్పికర్ ఈ సినిమాలో మరో హీరోయిన్.. రమ్యకృష్ణది కీలక పాత్ర. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
సినిమా కంప్లీట్ అవుతున్న సమయంలో కృష్ణవంశీ తన లవ్ ప్రపోజల్ రమ్యకృష్ణ ముందు ఉంచాడు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాక వీరు 2003లో పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ల పాటు వీరు ప్రేమించుకున్న విషయం ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కృష్ణవంశీకి పెద్దగా అవకాశాలు లేకపోయినా రమ్యకృష్ణ మాత్రం సెకంగ్ ఇన్సింగ్స్‌లోనూ దూసుకుపోతోంది.