యువరత్న నందమూరి బాలకృష్ణ జోరు ఇప్పుడు మామూలుగా లేదు. ఈ వయస్సులోనూ ఆయన ఇంత క్రేజ్‌తో దూసుకు పోతుండడం సినిమా, రాజకీయ వర్గాలకే షాకింగ్‌గా మారింది. అసలు ఇందుకు కారణాలు ఏంటి ? ఇంతే వయస్సుతో ఉన్న ఆయన తోటి హీరోలు ఈ వయస్సులో ఛరిష్మా తగ్గిపోయి చతికిలపడుతున్నారు. బాలయ్య పేరు చెపితే ఆయన అభిమానులకే కాదు.. జనాలకు కూడా పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటన్నది చూస్తే చాలా ఆసక్తికర పరిణామాలే కనిపిస్తున్నాయి.
ఏ పరిస్థితిల్లోనూ కూడా తలవంచకుండా, దేనికి వెనుకడుగు వేయకుండా.. ఓటమి పాలైనా కూడా కూడా ఆత్మస్థైర్యంతో ఉండడమే బాలయ్యకు మేజర్ ప్లస్ పాయింట్. బాలయ్యకు విమర్శలు, ఓటములు పట్టవు. ఓటమి ఎదురు అయితే ఓ మూలన కూర్చోవడం అస్సలు తెలియదు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ సినిమా డిజాస్టర్లు. అయినా రెండేళ్లు గ్యాప్ తీసుకుని అఖండ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేశాడు.
చాలా మంది లోపల ఒకటి పెట్టుకుని.. బయటకు మరొకటి మాట్లాడుతూ ఉంటారు. బాలయ్యది అలాంటి మనస్తత్వం కాదు.. ఆయన ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారు. అయితే చాలా మంది అలా ఉండలేరు కాబట్టే బాలయ్యను అభిమానిస్తారు. మరి కొందరు బాలయ్యకు పిచ్చి ఉందని చెప్పినా.. ఆయన ఫ్యాన్స్‌ను కొడతారని ప్రచారం చేసినా.. అవే ఫ్యాన్స్‌కు ఇష్టం.
బాలయ్య చేసిన సేవలు, గొప్పలు ఎప్పుడూ చెప్పుకోరు. ఆయన ఎవరు అయినా ఆపదలో ఉన్నారని తెలిస్తే చలించిపోతారు. తన వంతుగా వెంటనే స్పందిస్తారు. ఉదయభాను తన పిల్లల పుట్టిన రోజుకు పిలిచినా వెళతారు.. పాప్ సింగర్ స్మిత ఆపదలో ఉన్నానని ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు. అది బాలయ్య నైజాం. బాలయ్య భోళా మనిషి.
దీంతో పాటు బుల్లితెర మీద బాలయ్య టాక్ షో చేస్తున్నాడన్న టాక్ వచ్చినప్పుడు.. బాలయ్య ఏం చేస్తాడు అనుకున్నారు. అలాంటి వాళ్లకు తనదైన కామెడీ స్టైల్ హోస్టింగ్‌తో ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ వయస్సులో అఖండ పాత్రతో అదర గొట్టేశాడు. ఇలాంటి పాత్ర బాలయ్య తప్ప ఎవ్వరూ చేయలేరన్న ఘనత సొంతం చేసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్, ఏపీలో టిక్కెట్ల రేట్లు తగ్గిపోయాక ఏ హీరో చేయనంత సాహసం చేసి అఖండను రిలీజ్
చేసి.. తాను ఎక్కడా వెనక్కు తగ్గనని ఫ్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఎప్పుడూ బాలయ్య క్రేజ్ రెండాకులు పెరుగుతూ ఉంటుందే తప్పా తగ్గదు.