దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావుకు తెలుగు నాట ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎన్టీఆర్ తెలుగు నాట ఓ సంచలనం. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా జాతీయస్థాయిలో సత్తా చాటుకున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ దర్శకులతో పనిచేశారు. ఎంతో మంది కొత్త దర్శకులకు కూడా ఆయన అవకాశం ఇచ్చారు. అయితే కొందరు దర్శకులు ముందు ఎన్టీఆర్‌కు సూపర్ హిట్లు ఇచ్చినా ఆ తర్వాత వారి మధ్య కొన్ని కారణాలతో గ్యాప్ వచ్చింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు – ఎన్టీఆర్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత అదే దాసరికి, ఎన్టీఆర్‌కు గ్యాప్ వచ్చింది. అయితే అది సినిమాల్లోనో లేదా వృత్తిపరంగానో కాదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. దాసరి ముందు నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉండేవారు. ఆ తర్వాత దాసరి ఉదయం పేపర్ స్థాపించి.. అందులో ఎన్టీఆర్ , తెలుగుదేశంకు వ్యతిరేకంగా వార్తలు రాయించేవారన్న టాక్ ఉంది. అలా ఆ ఇద్దరి మధ్య తెలియని గ్యాప్ పెరిగింది.
ఇక కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఎన్టీఆర్‌కు కూడా విబేధాలు వచ్చాయట. వీరిద్దరిది ముందు సూపర్ హిట్ కాంబినేషన్. సినిమాల్లోకి రాకముందు నుంచే ఎన్టీఆర్‌కు, కె. విశ్వనాథ్‌తో పరిచయం ఉందట. ఎన్టీఆర్ సబ్‌రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వచ్చారు. ఆయన హీరోగా ఉంటే.. విశ్వనాథ్ వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా చేరారు. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి.
వీరి కాంబినేషన్లో తొలి సినిమా అదృష్టం. మిద్దే జగన్నాథ్ రావు నిర్మాత. కాంచన హీరోయిన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎబో యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో నిండు హృదయాలు సినిమా వచ్చింది. ఎన్టీఆర్ – వాణి శ్రీ కాంబోలో వచ్చిన తొలి సినిమా ఇదే. ఆ తర్వాత మూడోసారి వీరి కాంబినేషన్లో నిండు దంపతులు సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
ఆ తర్వాత నాలుగో సినిమాగా చిన్ననాటి స్నేహితులు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఆ తర్వాత విశ్వనాథ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాలేదు.