ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప – దిరైజ్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప ఇప్పటికే ప్రీమియర్ షో లు కంప్లీట్ చేసుకుంది. అల్లు అర్జున్ నుంచి అల వైకుంఠ పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు… అటు నుంచి రంగస్థలం తర్వాత సుక్కు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి.
బన్ని కెరీర్లోనే తొలిసారిగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతూ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప హంగామా అయితే మామూలుగా లేదు. ఇక పుష్ప టికెట్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆన్ లైన్ లో పెట్టిన కొద్దిసేపటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. చివరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు సైతం టికెట్లు దొరకని పరిస్థితి ఉంది.
ఇదే విషయాన్ని యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పుష్ప సినిమా టికెట్లు అడిగే వ్యక్తుల నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్స్ కు… తాను సమాధానం ఇవ్వడంతోనే రోజులో సగం టైం అయిపోయింది అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. హైదరాబాదులో ప్రముఖ థియేటర్లలో ఒక్క టిక్కెట్ కూడా అందుబాటులో లేదు అని… తనకు టిక్కెట్లు కావాలని ఫోన్ చేసిన వారినే… తిరిగి తాను టిక్కెట్లు అడగాల్సి వచ్చిందన్నాడు.
దీనిని బట్టే పుష్ప మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోందని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నాడు. ఒక పెద్ద సినిమా తో మళ్లీ ఇండస్ట్రీలో పెద్ద ఎగ్జైట్మెంట్ వాతావరణం నెలకొందని.. పుష్ప హిట్ అవ్వాలని రాహుల్ రవీంద్రన్ కోరాడు. ఇక హైదరాబాద్ లో అయితే ఐనాక్స్‌లు, మల్టీఫ్లెక్స్‌లలో పుష్ప టిక్కెట్లు దొరకని పరిస్థితి ఉంది.
Half my day has been spent answering phone calls from people asking for Pushpa tickets… there’s not one available in all of Hyderabad. And I ask them back if they can get me tickets:) The josh of a big release is such an exciting time:) Wishing the whole team a blockbuster 🙏🏽🤟🏽
— Rahul Ravindran (@23_rahulr) December 16, 2021