ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లలో పూజాహెగ్డే కూడా ఒకరు. పూజా హెగ్డే ప్రస్తుతం ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ భారీ సినిమాలు చేస్తోంది. పూజ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్లు సైతం పూజ క్రేజ్ ను చూసి కాస్త అసూయపడే స్టేజ్‌లో ఆమె ఉంది. వరుసగా స్టార్ హీరోలతో వస్తున్న ఛాన్సులను పూజ బాగానే క్యాష్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ప్రస్తుతం ఈ సినిమాకు మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట.
దీనికి తోడు ఆమె ఇద్దరి అసిస్టెంట్లకు కూడా ఫైవ్ స్టార్ హోటల్ లో రూం బుక్ చేయడంతో పాటు.. వారి చార్జీలు. ఫ్లైట్ టికెట్ లు కూడా అదనంగా వసూలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూజ గురించి ఆమె అభిమానులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. పూజా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చింది. మిస్ ఇండియా పోటీల్లో ఆమె ఒక్క సారిగా తళుక్కున మెరిసింది. ఆ తర్వాత పలు వ్యాపార ఉత్పత్తులకు అంబాసిడర్ గా చేసిన ఆమె నెమ్మది.. నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చింది.
బాలీవుడ్లో మొదటిసారిగా రణబీర్ కపూర్ తో కలిసి ఒక స్కూటీ యాడ్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె నార్త్ మొదటిసారిగా జీవా పక్కన మాస్క్ సినిమాలో నటించింది. ఆ సినిమా తెలుగులో విడుదలైన కూడా పూజను ఎవరూ పట్టించుకోలేదు. మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన ముకుంద సినిమాలో నటించిన ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
ఇక పూజ వ్యక్తిగతం విషయానికొస్తే ఆమె మొదటి అంతర్జాతీయ ట్రిప్ థాయిలాండ్ కు వేసిందట. అక్కడ తన కుటుంబంతో కలిసి కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం ఈమె దగ్గర కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. ఆమె నడిపిన మొదటి కారు బీఎండబ్ల్యూ -5. చిన్న వయస్సులోనే ఆమెకు బీఎండబ్ల్యూ కారు అంటే మక్కువ పెంచుకుంది. ఆ తర్వాత ఆమె మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్‌లో ఆమె తొలి సంపాదన రు. 5 వేలు.
ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె రెమ్యునరేషన్ రు. 50 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు వరకు తీసుకుంటోంది. ఆమెకు కుక్కలు అంటే చాలా ఇష్టం.