టాలీవుడ్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాల క్రితం మాటల రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ఊపేశారు. తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ మొదటి సినిమాతోనే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండో సినిమాగా మహేష్‌బాబుతో అతడు సినిమాను తెరకెక్కించి ఒక మాస్ సబ్జెక్ట్ ను కూడా క్లాస్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ చేయాలో చేసి చూపించారు. అతడు సినిమా వచ్చి దశాబ్దంన్నర అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుంటే ప్రేక్షకులు అతుక్కుపోయి చూస్తారు.
వాస్తవంగా చూస్తే అతడు సినిమాను ముందుగా త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే పవన్ ఆ కథపై పవన్ ఆసక్తి చూపకపోవడంతో చివరకు మహేష్‌బాబుతో తీయాల్సి వచ్చింది. అతడు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా చూసిన పవన్ మంచి సినిమా మిస్ అయ్యానని భావించి త్రివిక్రమ్‌తో వెంటనే జల్సా సినిమా చేశాడు. జల్సా సినిమా కూడా వైవిధ్యమైన సినిమాగా ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు కాంబినేషన్లో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా వచ్చాయి. అతడు తర్వాత మరోసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఖలేజా సినిమా చేశారు. ఖలేజా తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా పట్టాలు ఎక్కలేదు. ఇదిలా ఉంటే అరవింద సమేత వీర రాఘవ సినిమా కథను త్రివిక్రమ్ – మహేష్ బాబు కోసమే రెడీ చేశారట.
అదే సమయంలో తార కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో అప్పటికప్పుడు త్రివిక్రమ్ – మహేష్ బాబు రెడీ చేసిన కథతో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసేశారు. ఈ స్టోరీ లైన్ తారక్‌కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిసారిగా తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ అయింది. మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా త్వరలో రానుంది.