ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కథను రాసుకునేటప్పుడు ఒక హీరోను హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేస్తారు. లేనిపక్షంలో కొందరు దర్శకులు ముందుగా ఒక హీరోని కలిసి.. ఆ హీరోతో ఒక లైన్ అనుకున్నాకే… దాని చుట్టూ కథ అల్లుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ కథను జడ్జ్ చేసే విషయంలో హీరోలు రాంగ్ స్టెప్ వేస్తారు. అయితే అదే కథతో వేరే హీరోతో సినిమా చేసి.. సూపర్ డూపర్ హిట్లు కొడుతూ ఉంటారు దర్శకులు.
ఒక హీరో వదులుకున్న కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టాక… ముందుగా ఆ కథను వదులుకొన్న హీరో తాను సూపర్ హిట్ ను వదులుకున్నానని ఫీల్ అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు అందరూ ఇలా సూపర్ డూపర్ హిట్ సినిమాల కథ జడ్జి చేయలేక హిట్లు మిస్ అయినవారే. ఈ క్రమంలోనే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కొన్ని కథలను రిజెక్ట్ చేశారు. అయితే వాటిల్లో ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి ఈ దేశాన్ని ఊపేసిన రోజా సినిమాలో హీరో పాత్రకు ముందుగా వెంకటేష్ ని సంప్రదించారు. అయితే వెంకటేష్ అదేసమయంలో చంటి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఆ అదృష్టం అరవింద స్వామికి దక్కింది. అరవింద స్వామి సూపర్ హిట్ సినిమా సొంతం చేసుకున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాలో ముందుగా వెంకటేష్ హీరోగా అనుకున్నారు.
వెంకటేష్ అప్పటికే ఉదయశంకర్ దర్శకత్వంలో కలిసుందాం రా సినిమా చేస్తున్నారు. అలా ఆ బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ ఖాతాలో పడింది. ఏదేమైనా శంకర్ దర్శకత్వంలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించే మంచి అవకాశాన్ని వెంకటేష్ కోల్పోయారు. ఇక వెంకటేష్ అంటేనే కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రస్. సంతోషం దర్శకుడు దశరథ్ సంతోషం సినిమాలో వెంకటేష్ ను హీరోగా అనుకున్నారు.
ఈ కథ వెంకటేష్ కు కూడా చెప్పారు. అయితే అప్పటికే ఇలాంటి కథలతో సినిమాలు చేసిన వెంకటేష్ సంతోషంలో నటించేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ బ్లాక్ బస్టర్ నాగార్జునకు దక్కింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన క్రాక్ సినిమాలో వెంకటేష్ నటించాల్సి ఉంది.
క్రాక్ దర్శకుడు మలినేని గోపిచంద్ ముందుగా ఈ కథను వెంకటేష్ కే చెప్పారు. అయితే ఆయన దృశ్యం 2, నారప్ప సినిమాలతో బిజీగా ఉండటంతో క్రాక్ వదులుకున్నారు. అయితే చివరకు మాస్ మహారాజ్ రవితేజకు క్రాక్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.