యువరత్న నందమూరి బాలకృష్ణ తన తాజా సినిమా అఖండతో బాక్సాఫీస్ దగ్గర గర్జన చేస్తున్నారు.నందమూరి నటసింహం బాలకృష్ణ – మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. కరోనా ప్రభావంతో ఏడాదిన్నర పాటు థియేటర్లలో రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన అఖండ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో అఖండ అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటించారు. థమన్ సంగీతం అందించారు.
విడుదలకు ముందే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానుల అంచనాలు నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సొంతం చేసుకొంది. మురళీకృష్ణ, శివుడిగా ద్విపాత్రాభినయంలో బాలయ్య అదరగొట్టేశారు. ముఖ్యంగా ఇ‘అఖండ’ సినిమ అలో అఘోరగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక జై బాలయ్య అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోయింది. సింగర్ గీతా మాధురి వాయిస్ ఈ పాటకు బాగా కలిసొచ్చింది. ఓవర్ ఆల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో అఖండ టీమ్ కు సోషల్‌మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇక్ ఇప్పటికే ఈ సినిమా పై ఎందరో సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలు వ్యక్తంచేయగా..రీసెంట్ గా బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి అఖండ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించింది.
అఖండ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆమె సినిమాపై అలాగే తన తండ్రి బాలకృష్ణ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ..” సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పిన ఆమె.. మా నాన్న గారికి వయసుతో పాటు ఎనర్జీ లెవలెస్ కూడా పెరిగిపోతున్నాయని చెప్పింది. గతంలో నాన్న గారు చేసిన సినిమాలకు మించి అఖండ సినిమా ఉంది.. ఇంతటి సెన్సేషనల్ రికార్డు ఇప్పటివరకు నాన్నగారు సాధించలేదు అని చెప్పుతూ.. అప్పట్లో సినిమా స్టాండర్డ్స్ ని తాతగారు పెంచగా .. ఇప్పట్లో సినిమా స్టాండర్డ్స్ ను మా నాన్నగారు పెంచుతున్నారు”అంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేసింది.