ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం పుష్ప ది రైజ్. స్కై రేంజ్ అంచనాలతో శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. స్మగ్లర్‌గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. బన్నీ కెరీర్‌లో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.
ఒక తొలి రోజు నార్త్‌లో మినహా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసినట్టుగా కలెక్షన్లు చెపుతున్నాయి. నైజాంలో ఫస్ట్ డే ఏకంగా రు. 10 కోట్ల షేర్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాను దిల్ రాజు రు. 38 కోట్లకు కొని రిలీజ్ చేశారు. తొలి రోజే ఏకంగా రు. 10 కోట్ల షేర్ రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు అయితే షాక్‌లో ఉన్నాయి.
ఇక ఓవర్సీస్‌లో కూడా పుష్ప తొలి రోజు వసూళ్లలో దుమ్ము రేపిందని తెలుస్తోంది. అక్కడ మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను రు. 14 కోట్ల రేంజ్‌లో అమ్మారు. 390 స్క్రీన్లలో అక్కడ పుష్ప రిలీజ్ అయ్యింది. అయితే తొలి రోజే ఏకంగా రు. 10 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి అనకాపల్లి నుంచి అమెరికా వరకు పుష్ప మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
2021లో రిలీజ్ అయిన అన్ని తెలుగు సినిమాల్లోనూ ఇదే ఫస్ట్ డే టాప్ ఓపెనింగ్‌గా నిలిచింది. సినిమాలో బన్నీ నటనతో పాటు రష్మిక అందాలు, ధనంజయ, ఫాహద్ పాజిల్, సునీల్, అనసూయ పాత్రలు సుకుమార్ టేకింగ్ అన్ని హైలెట్ అయ్యాయి.