Moviesఅఖండ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించిన ఈమె ఎవరో తెలుసా..?

అఖండ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించిన ఈమె ఎవరో తెలుసా..?

నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి అంటే సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి అఖండ సినిమాతో వచ్చారు. బ్లాక్ బస్టర్ కొట్టేశారు. పది రోజుల్లోనే దాదాపు 100 కోట్ల గ్రాస్ షేర్ కొల్లగొట్టారంటే అది మామూలు విషయం కాదు.

కరోనా ఇంతలా భయపెడుతున్నా, ఏపీలో టికెట్లు, థియేటర్ల సమస్యలున్నా కూడా అఖండ విజయానికి ఏదీ అడ్డుగోడగా నిలవలేదు. ఇక ఈ సినిమా లో బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. ప్రగ్నా జైశ్వాలు ఈ సినిమాలో బాలయ్య కు భార్య గా నటించి ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించిన ఆమె పేరు విజి చంద్రశేఖర్. తనదైన శైలీలో నటించి ఒక్క అమ్మగా తన ఆవేదన ను స్క్రీన్ పై బాగాపండించింది. దీంతో ఈమె గురించి నెట్టింట సెర్చింగులు చేస్తున్నారు. అసలు ఈమె ఎవరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్  ఏంటి..? భర్త ఎవరు..? పిలలు ఉన్నారా..? ఇది వరకు ఎన్ని సినిమాల్లో నటించింది..? అంటూ సెర్చ్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ మూవీ అఖండ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించిన ఈమె పేరు విజి చంద్రశేఖర్. ఈమె భర్త ఎయిరిండియాలో సీనియర్ కెప్టెన్ గా పని చేసి ఈ మధ్యనే రిటర్డ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈమెకు ఇద్దరు పిలల్లు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలే. ఒక అమ్మాయి డాక్టర్ గా పని చేస్తుంది అని చెప్పిన ఈమె మరో అమ్మాయి ఇప్పుడిప్పుడే సినిమాలోకి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం ఉన్నా కూడా భార్యభర్తలు ఇద్దరు కెరీర్ లో బిజీ అయిపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్న కూడా ఇంట్రెస్ట్ చూయించట్లేదట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news