సీనియర్ ఎన్టీఆర్ తన పాత్రలతో ఇప్పటకీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోయారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పనిచేశారట. ఆ తర్వాత ఆయన రెండు షిఫ్టులుగా పనిచేయడం ప్రారంభించారట. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిఫ్ట్‌లో పనిచేశారట.
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో షిఫ్ట్‌లో పనిచేసేవారట. ఇలా ఉదయం ఒక షిఫ్ట్‌లో ఒక సినిమాకు.. సాయంత్రం షిఫ్ట్‌లో మరో సినిమాకు ఆయన వర్క్ చేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఇలా కాదని.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒకే సినిమాకు పనిచేసేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అవసరాన్ని బట్టి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వర్క్ చేయడం అలవాటు చేసుకున్నారు.
ఇక ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు చూస్తే చాలా తమాషాగా ఉంటాయట. వేకువఝామునే 3.30 గంటలకు నిద్రలేవడం ఆయనకు అలవాటు. ఆ తర్వాత యోగాసనాలు చేసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ప్రతి రోజూ ఆయన 24 ఇడ్లీలు అవలీలగా తినేసేవారు అట. అవి చిన్న ఇడ్లీలు కూడా కావట. అరచేతిమందాన ఉండేవట. కొంత కాలానికి ఇడ్లీలు మానేసి ఉదయాన్నే ఆయన భోజనం చేయడం అలవాటు చేసుకున్నారట. ప్రతి రోజూ కూడా ఆయన ఆహారంలో నాన్‌వెజ్ ఐటెం తప్పకుండా ఉండాల్సిందే అట.
ఇక ఉదయం 6 గంటలకే ఆయన మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారట. నిర్మాతలు స్వయంగా వచ్చి ఆయన్ను షూటింగ్ స్పాట్‌కు తీసుకువెళ్లేవారట. చెన్నైలో ఉంటే మాత్రం తప్పకుండా భోజనానికి ఇంటికే వెళ్లేవారట. ఇక షూటింగ్ లో చిన్న గ్యాప్ వచ్చినా యాపిల్ జ్యూస్ తాగడం ఆయనకు అలవాటు. ఆయన స్పాక్స్‌లో ప్రతి రోజు 30 – 40 మిరపకాయ బజ్జీలు తింటుంటే పక్కనే ఉన్న వాళ్లందరూ నోళ్లు వెళ్లబెట్టుకుని చూసేవారట.
ఆయన డ్రై ఫ్రూట్స్‌తో పాటు రెండు లీటర్ల బాదం పాలు ఉఫ్‌మని ఊదేసేవారట. ఇక సమ్మర్ వస్తే ఆయన మధ్యాహ్నం లంచ్ చేసేవారు కాదట. మామిడ పళ్ల జ్యూస్ ఎక్కువుగా తీసుకునేవారట. టీ నగర్‌లో మామిడిపళ్లు ఎక్కడ దొరకుతాయో ? కూడా ఆయన చెప్పేవారట. తన అసిస్టెంట్‌తో మామిడి పళ్ల రసం తీయించుకుని.. అందులో గ్లూకోజ్ కలుపుకుని తాగేసేవారట.
ఆ తర్వాత ఆయన కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి బాగా దంచి ముద్దగా చేసి వెండి బాక్సులో ఎన్టీఆర్ సతీమణి బవసతారకం పంపిన మిశ్రమాన్ని తినేవారట. ఇక ఎన్టీఆర్ ఎంత తిన్నా కూడా ఆయన శరీరం అంతగా అరాయించుకునేదట.