పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుముఖప్రజ్ఞాశాలి.. పవన్ కళ్యాణ్ లో చాలా కళలు ఉన్నాయి. పవన్ ఒక నటుడు మాత్రమే కాదు… ఒక ఫైట్ మాస్టర్ …ఒక కథా రచయిత… ఒక దర్శకుడు కూడా..! మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమా రంగంలోకి వచ్చిన పవన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో దర్శకుడిగా మారారు. అలాగే ఆ సినిమాకు ఫైట్ మాస్టర్ గా కూడా పనిచేశారు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కథను అందించారు.
వకీల్‌సాబ్ సినిమాతో పొలిటికల్గా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు దర్శకత్వం వహించడానికి ముందే ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ విషయం చాలామందికి తెలియదు. పవన్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరో అయ్యారు.
అయితే అంతకుముందే దాసరి నారాయణరావు దగ్గర పవన్ ఒక సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశారు. ఆ సినిమా ఏదో కాదు దాసరి నారాయణ రావు – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన లంకేశ్వరుడు. దాసరి నారాయణరావు 100వ సినిమాగా లంకేశ్వరుడు తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ ఆ సినిమాతోనే దాసరి నారాయణరావు దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు అట.
అయితే లంకేశ్వరుడు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే టేకింగ్ పరంగా మాత్రం ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన పవన్ దర్శకత్వంలోకి వెళతారని చాలామంది అనుకున్నారు. అయితే అనూహ్యంగా హీరో అయ్యి… ఈరోజు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.