నందమూరి తారక రామరావు గారి మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్.. ఆ తరువాత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ యంగ్ టైగర్ గా ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్దానాని సంపాదించుకున్నారు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని మాత్రమే కాదు… నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈరోజు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. చిన్నతనం లోనే బాలరామాయణం సినిమాలో నటించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్..ఇప్పుడు కూడా ఢిఫరెంట్ జోనర్ లో సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ అధ్బుతంగా నటిస్తూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్.
విఆర్. ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తారక్..ఆ తరువాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తెలుగుతెర పై చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పైన సినిమా మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ అనే చెప్పాలి. ఈ సినిమా ఆయనకు మంచి స్టార్ డం తీసుకువచ్చింది. ఇక ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక తారక్ లో ఎవరికీ తెలియని మరో టాలెంట్ కూడా ఉంది. అదేంటంటే భాషలు మాట్లాడటం.
ఎన్టీఆర్ కు తెలుగు, ఇంగ్లీష్ తో పాటూ మరికొన్ని భాషలు కూడా మాట్లాడగలడు అని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ రీసెంట్ గా జరుగుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తనలో కొత్త టాలెంట్ ను బయటపెట్టారు. కర్నాటక లోని బెంగుళూరులో ఈవెంట్ లో కన్నడ అద్భుతంగా మాట్లాడాదు. అంతే కాకుండా ముంబైలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ఎన్టీఆర్ హిందీలో మాట్లాడుతూ అక్కడ వారిని ఆకట్టుకున్నారు.
మరోవైపు చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తమిళ్ లో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ ప్రెస్ మీట్ లు చూసిన ఎన్టీఆర్ అభిమానులు వివిధ భాషల్లో మాట్లాడటం చూసి అవాక్కయ్యారు. ఎన్టీఆర్ కు ఇన్ని భాషలు వచ్చా అని ఆశ్చర్యపడుతున్నారు.
ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ కోసం అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఇద్దరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరీ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తున్నారు రాజమౌళి.