గత పది రోజులుగా దేశవ్యాప్తంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లి గురించి వార్తలు మీడియా, సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ప్రతి గంటకు వీరి పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో వస్తూనే ఉంటుంది. వీరి పెళ్లి సీక్రెట్ గా రాజస్థాన్లో జరుగుతుండడంతో ఏ చిన్న విషయం బయటికి వచ్చినా… అది జనాలకు పెద్ద వార్త అయిపోతుంది. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎప్పటినుంచో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు ఈ రోజుతో పుల్ స్టాప్ పడినట్లు అయింది.
ఈ పెళ్ళికి కత్రినాకైఫ్ – విక్కీ కౌశల్ బంధువులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్‌లో కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే హాజరయ్యారు. వీరి సమక్షంలోనే కత్రినా, విక్కీ దంపతులు అయ్యారు. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి విషయాన్ని కత్రినాకైఫ్ – విక్కీ కౌశల్ చాలా సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం ప్రధానంగా చర్చకు వస్తోంది.
అదే కత్రినా కైఫ్ వయస్సు విక్కీ కంటే పెద్ద అన్న విషయం. ఇది బయటకు రావడంతో అసలు వీరిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. విక్కీ కంటే కత్రినా కైఫ్ ఐదు సంవత్సరాలు పెద్దది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు వయసులో తమ కంటే పెద్ద వారిని పెళ్లి చేసుకున్నారు.
అభిషేక్ – ఐశ్వర్య, సైఫ్ అలీఖాన్ , ప్రియాంక చోప్రా తాజాగా కత్రినా వీళ్లంతా వయసులో తమ కంటే చిన్న వాళ్లను పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక చోప్రా కంటే ఆమె భర్త నిక్కీ ఏకంగా పది సంవత్సరాలు చిన్నవాడు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన భర్త కంటే ఏడాది పెద్దది. మనసులు కలవాలే కాని వయసు అన్నది దంపతుల మధ్య పెద్ద పట్టింపే కాదని మన స్టార్ హీరో, హీరోయిన్ల ప్రేమలు నిరూపిస్తున్నాయి.