తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి అనగానే మనకు ఎక్కువుగా ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్లే గుర్తుకు వస్తాయి. ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో పెళ్లాం ఊరెళితే సినిమాలో ఆమె ఏ ముహూర్తాన వ్యాంప్ క్యారెక్టర్ చేసిందో గాని అప్పటి నుంచి ఆమెకు అవే క్యారెక్టర్లు ఎక్కువుగా వచ్చాయి. తర్వాత ఆ టైప్ క్యారెక్టర్లకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె హంగామా – ఎవడిగోల వాడిదే – మహాత్మ – కెవ్వు కేక సినిమాల్లో నటించింది. జ్యోతికి కూడా స్పెషల్‌గా అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.
ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినా ఆమె సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే జ్యోతికి పెళ్లవ్వడం, విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయాయి. మధ్యలో ఆమె జీవితంపై చాలా పుకార్లు షికార్లు చేశాయి. జ్యోతి తన తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ పెళ్లి, విడాకుల గురించి చెప్పారు.
తాను ఎన్నో ఆశలతో ప్రేమ పెళ్లి చేసుకున్నానని.. దుబాయ్ లో సెటిల్ అయిన కుటుంబానికి చెందిన అబ్బాయిని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. అతడు వయస్సులో కూడా తనకంటే రెండేళ్లు చిన్నవాడు అని.. ఆ తర్వాత ఆధిపత్య పోరు విషయంలో తాము విడిపోవాల్సి వచ్చిందని జ్యోతి చెప్పింది. తమకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడని చెప్పింది.
తమ ఇద్దరికి అప్పటకి మెచ్యూరిటీ లెవల్స్ తక్కువుగా ఉండడంతో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడాకులు తీసుకున్నానని.. పెళ్లితో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఇప్పట్లో తాను మళ్లీ పెళ్లి జోలికి వెళ్లనని తెలిపింది. తాను డేటింగ్‌కు రెడీగా ఉన్నానన్న జ్యోతి.. ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే.. డేటింగ్‌కు సై అని సవాల్ చేస్తోంది.