ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పట్టింపుగా మారిపోతూ ఉంటాయి. ఒకే రంగంలో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల మధ్య కూడా ఎంత లేదన్నా ఈగో అనేది ఉంటుంది. తాము ముందు ఉండాలన్న కోరిక ఏ రంగంలో ఉన్నవారికి అయిన సహజం. తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా వాయిదా విషయంలో రాజమౌళి చేసిన పనికి మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫీలయ్యారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఉంది. ఈ సినిమా జనవరి 12 వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. అదే రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి వస్తే కచ్చితంగా ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలపై ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. పైగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమా వాయిదా వేయించేందుకు గత నెల రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున లాబీయింగ్ నడిచింది.
చివరకు భీమ్లానాయక్ సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేయించటంలో దిల్ రాజు తోపాటు రాజమౌళి లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే రాజమౌళి వేసిన ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. భీమ్లానాయక్ వాయిదా పట్ల రాజమౌళి చెప్పిన ధన్యవాదాలు కూడా పవన్ ఫ్యాన్స్‌తో పాటు త్రివిక్రమ్‌కు రుచించలేదట. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.
పైగా రాజమౌళి మహేష్ సర్కారువారి పాటను కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఆ సినిమా కూడా సంక్రాంతికి ఖచ్చితంగా రావాల్సిన సినిమాయే అని.. అది కూడా వాయిదా వేసి తమకు సాయం చేశారన్న విషయాన్ని పరోక్షంగా అయినా ప్రస్తావించారు. అయితే ఇక్కడ భీమ్లానాయక్ సినిమాను ముందునుంచి అన్ని తానై నడిపిస్తున్నాడు త్రివిక్రమ్. ఇక్కడ థ్యాంక్స్ చెప్పే విషయంలో కనీసం తన పేరు కూడా ప్రస్తావించకపోవడమే ఇప్పుడు త్రివిక్రమ్‌కు నచ్చలేదట.
ఇక రాజమౌళి చెప్పిన థ్యాంక్స్‌లో నిర్మాత చినబాబు పేరు ముందు వేసి, వెనుక పవన్ పేరు వేయడం పవన్ ఫ్యాన్స్ కూడా కాస్త అసహనానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ ఒప్పుకోబట్టే భీమ్లానాయక్ వాయిదా జరిగింది. ఆ విషయం తెలిసి కూడా ఆయన పేరు ఎందుకు ప్రస్తావించలేదని ఇండస్ట్రీలో గుసగుసలు కొన్ని సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి చిన్న చిన్నవాటి గురించి అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని కొందరు అంటున్నారు.