‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.బాహుబలి – ది కంక్లూజన్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. ఇక రీసెంట్ గా ట్రైలర్ అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది.
అయితే, సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదని దర్శకుడు రాజమౌళి తెలిపారు. కాగా ఇ ఇ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ అందరిని ఆకర్షించింది. దీంతో నెట్టింట ఈ బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశారట.. ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్.. ఆ బైక్ 1934 కు చెందిన ఎమ్ సిరీస్ బైక్‌లా కనిపిస్తోంది. సినిమా కోసం బైక్‌లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది బ్రిటన్‌కి చెందింది. వెలోసెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వెలోసెట్ ఎమ్ సిరీస్ బైక్ ధర ప్రస్తుతం సుమారు రూ.9 లక్షలుగా ఉంది. అది కూడా వేలం వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుంది. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు.. వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది ఈ వెలోసెట్ .