ఘంటసాల బలరామయ్యకు తెలుగు గడ్డపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమన మరణించి దశాబ్దాలు అవుతున్నా ఘంటసాల పాటలు అంటే చెవి కోసుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. తన సుమధుర సంగీతంతో ఘంటసాల ఇప్పటికీ… ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఘంటసాల సంగీతం అంటే ఒక సుమధురం. అప్పట్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆయన సొంతం. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాకు చెందిన ఘంటసాల దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేశారు.
పౌరాణికం – సాంఘిక సినిమాలకు ఆయన అందించిన సంగీతం అజరారామం. తొలితరం నేపథ్య గాయకులలో ఒకరిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న ఘంటసాల చిన్నప్పుడే పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేవారట. అందరూ ఘంటసాలను బాల భరతుడు అని పిలిచేవారు. ఘంటసాల తండ్రి తన చివరి రోజుల్లో ఘంటసాల గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కోరుకున్నారట. తండ్రి చివరి కోరిక నెరవేర్చడానికి ఘంటసాల ముందు గురుకులంలో చేరటం.. ఆ తర్వాత ఆయన సంగీత విద్వాంసుల వద్ద చేరి సంగీతం నేర్చుకోవడం జరిగాయి.
స్వర్గసీమ సినిమాకు నేపథ్య గాయకుడిగా పనిచేసిన ఘంటసాల అప్పట్లోనే రు. 116 రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు. పాతాళ భైరవి సినిమా తర్వాత ఘంటసాలకు మంచి పేరు వచ్చి ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఘంటశాలపై చివర్లో రకరకాల రూమర్లు వచ్చాయి. ఆయన రెండో భార్య సరళాదేవి వల్ల ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారన్న ప్రచారం జరిగింది.
అయితే సరళాదేవి కుమారుడు రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి వల్లే తండ్రి ఇబ్బందులు పడ్డారని ప్రచారం జరిగిందని.. అయితే దీనిపై ఏం మాట్లాడినా తన తండ్రి పరువు పోతుందనే ఆమె మౌనం వహించారని .. ఘంటసాల పిల్లలు వీథికి ఎక్కారు అన్న అపవాదు తమకు రాకూడదనే తాము సైలెంట్‌గా ఉన్నామని చెప్పాడు.
ఆ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు రావడంతో తాను మద్రాస్‌లోని దూరదర్శన్‌లో చేరానని.. అయితే స్టార్ హీరోలకు తమ ఇబ్బందులు తెలిసినా కూడా తెలియనట్టే ఉండేవారని రవి వాపోయాడు.