యువరత్న నందమూరి బాలకృష్ణ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు… ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్లో 1990వ సంవత్సరంలో లారీ డ్రైవర్ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత వరుసగా రౌడీ ఇన్స్పెక్టర్ – సమరసింహారెడ్డి – నరసింహనాయుడు సినిమాలు వచ్చాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి.
నరసింహానాయుడు అయితే సౌత్ సినిమా ఇండస్టీలోనే తొలిసారిగా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. బాలయ్యకు బి.గోపాల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అయితే లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ టైంలో బి.గోపాల్ పై బాలయ్య ఒకానొక సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ ముందుగా రాసిన సీన్లు కాకుండా కొత్త సీన్లు రాయడంతో కొన్ని సీన్లు రీషూట్ చేశారట.
అయితే వెంకటేశ్వరరావు కలెక్టర్ శారద పాత్ర పై రాసిన కామెడీ సీన్లు గోపాలకృష్ణకు నచ్చలేదట. అవతల కలెక్టర్ పాత్ర ఉందని ఆ పాత్రపై కామెడీ ఏంటని.. గోపాలకృష్ణ సీరియస్ సన్నివేశాలు రాశారట. ఆ సీన్లు రీ షూట్ చేస్తుండగా బాలయ్యకు కోపం రావడంతో కొద్ది రోజుల పాటు అలిగి గోపాల్‌తో మాట్లాడ లేదట. ఆ తర్వాత గోపాలకృష్ణ అక్కడ జరిగిన అసలు విషయాన్ని బాలయ్యకు చెప్పడంతో ఆ తర్వాత బాలయ్య కూల్ అయ్యారని బి.గోపాల్ ఓ సందర్భంలో చెప్పారు.
ఇక బాలయ్య మనసు వెన్న లాంటిది అని… ఆయన షూటింగ్‌కు కరెక్ట్ గా చెప్పిన టైంకు వస్తారని గోపాల్ చెప్పారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.