తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఆదివారంతో ముగిసింది. ఈ షోకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. టాలీవుడ్ నుంచి దర్శకధీరుడు రాజమౌళితో పాటు నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ టీం నుంచి నాని, సాయిపల్లవి, కృతిశెట్టి వచ్చారు. ఇక పుష్ప టీం నుంచి రష్మిక మందన్న, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ వచ్చి సందడి చేశారు. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన ఐదుగురిలో ముందుగా ముగ్గురిని ఎలిమినేట్ చేశారు. ఈ క్రమంలోనే శ్యామ్సింగరాయ టీం ఒకరిని, పుష్ప టీం మరొకరిని, బ్రహ్మాస్త్ర టీం ఎలిమినేట్ అయిన మెంబర్స్‌ను హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్ తనకు మన్మథుడు సినిమాతో మంచి ఛాన్స్ ఇచ్చినందుకు నాగ్ సార్‌కు ధన్యవాదాలు అని తెలిపాడు. ఆ తర్వాత ఆ సినిమాలోని అందమైన భామలు పాట పాడి వినిపించాడు. ఈ క్రమంలోనే నాగ్ దేవిశ్రీతో హార్ట్ జాగ్రత్త.. పడిపోతుంది.. అనడంతో సార్ ఈ విషయంలో నాకు మీరే ఆదర్శం అని కౌంటర్ ఇచ్చాడు. నాగార్జున అమ్మాయిలు ఉన్నారు… నీ హార్ట్ ఇక్కడ పడేసుకోకు అని దేవిశ్రీని సరదాగా ఆట పట్టించాడు.
అందుకు దేవిశ్రీ నాకు ఈ విషయంలో మీరే ఆదర్శం అనడంలో మీరు కూడా అమ్మాయిల కలల రాకుమారుడే కదా ? అందుకే మీరు ఆదర్శం అన్నట్టుగా కౌంటర్ ఇచ్చాడు. బాబు మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు.. నాకు సంబంధం లేదని నాగ్ అంటే.. ఎందుకైనా మంచిది అని ముందుగా సేఫ్ జోన్లో ఉండేందుకే మీ పేరు వాడానని దేవిశ్రీ చెప్పాడు. ఇక ఈ ఫినాలే వేదిక మీద రష్మిక మందన్న పుష్ప సినిమాలోని సామి.. రారా సామి సాంగ్‌కు డ్యాన్స్ వేసి అందరిని ఆకట్టుకుంది. ఆమె ఉన్నంత సేపు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.