నందమూరి తారక రామారావు స్టార్ హీరోగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు సినీ పరిశ్రమ మొదలైన రోజు నుంచి నేటి వరకు ఎన్టీఆర్ లాగా ఎవ్వరూ ఆయన చేసినన్ని పాత్రలు అయితే చేయలేదు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కానీ.. వేసే స్టెప్పులు కానీ.. ఇప్పటివరకు ఎవరు వేయలేదట.. అంతేకాదు ఈయన సినిమా కోసం ప్రేక్షకులు సంవత్సరాల తరబడి కూడా ఎదురుచూసేవారు.. అందుకే ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే దర్శకరత్నగా గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ దాసరి నారాయణ రావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఎంతో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. 151 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన దాసరి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోలుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలకు ఎక్కువుగా పనిచేశారు.
సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే, బొబ్బిలి పులి లాంటి సూపర్ హిట్ సినిమాలను ఎన్టీఆర్‌తో చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రత్యేక ఖ్యాతిని తీసుకొచ్చిన దాసరికి, ఎన్టీఆర్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎన్టీఆర్ తో దాసరి 5 సినిమాలను తెరకెక్కించారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్టీఆర్ బిజీగా ఉండటం.. ఇక దర్శకుడిగా, నిర్మాతగా దాసరి కూడా బిజీగా ఉండడం వల్ల అందుకే ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు తీయడం కుదరలేదు.
ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. హుషారైన డాన్స్ స్టెప్పులు, ఆయన నటన చూడడానికి ప్రేక్షకులు థియేటర్లలో ఎగబడేవారు.. బొబ్బిలి పులి సినిమా తీసేటప్పుడు దాసరి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి తన పాత్ర ఏంటో చెప్పడంతో.. వెంటనే ఓకే చెప్పేశారట ఎన్టీఆర్. క్లాప్ చెప్పిన తరువాత ఎన్టీఆర్ దాసరి ని కథ ఏంటో అడిగి తెలుసుకున్నారట.. అంతలా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.
సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకొని సెట్ లోకి రావడంతో ..మైమరిచిపోయిన దాసరి ఎన్టీఆర్ కాళ్లకు పాదాభివందనం చేయడం అప్పట్లో సంచలనం అయ్యింది.