Moviesఅప్ప‌ట్లో క్లాస్‌మెట్స్‌.. ఇప్పుడు టాప్ సెల‌బ్రిటీలు

అప్ప‌ట్లో క్లాస్‌మెట్స్‌.. ఇప్పుడు టాప్ సెల‌బ్రిటీలు

సాధార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల‌కు, హీరోల‌కు చాలా క్రేజ్ ఉంటుంది. వీరి గురించి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, చిన్న‌ప్ప‌టి విష‌యాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతూ ఉంటారు. అయితే టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న వారిలో కొంద‌రు సెల‌బ్రిటీలు, పారిశ్రామిక వేత్త‌ల‌తో క‌లిసి చ‌దువుకున్నారు. చిన్న‌ప్పుడు చ‌దువుకున్న వీరు కాల‌క్ర‌మంలో ఇప్పుడు త‌మ త‌మ రంగాల్లో తిరుగులేని స్టేట‌స్‌తో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1- రామ్‌చ‌ర‌ణ్ – శ‌ర్వానంద్‌:
మెగాస్టార్ త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌, హీరో శ‌ర్వానంద్‌, ద‌గ్గుబాటి రానా క‌లిసి బాల్యంలో ఒకే స్కూల్లో చ‌దువుకున్నారు. ఇప్పుడు వీరు ముగ్గురు టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు.

2- ముర‌ళీమోహ‌న్ – కృష్ణ‌:
సీనియ‌ర్ హీరోలు ముర‌ళీమోహ‌న్‌, కృష్ణ ఇద్ద‌రూ కూడా ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లో క్లాస్‌మెట్స్‌, బెంచ్‌మెట్స్ ఆ త‌ర్వాత వీరిద్ద‌రు సినిమా రంగాన్ని ద‌శాబ్దాల పాటు ఏలేసిన స్టార్ హీరోలు అయ్యారు. ద‌ర్శ‌కుడు క్రాంతికుమార్ కూడా వీరి క్లాస్‌మెట్‌.

3- నాని – ప్ర‌దీప్‌:
నేచుర‌ల్ స్టార్ నాని, యాంక‌ర్ మాచిరాజు ప్ర‌దీప్ ఈ ఇద్ద‌రూ కూడా హైద‌రాబాద్‌లోని సెంట్ అల్పోన్సా పాఠ‌శాల‌లో చ‌దువుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నానియే స్వ‌యంగా చెప్పారు.

4. అనుష్క శర్మ – సాక్షి:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ , భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సాక్షి ఇద్ద‌రూ క‌లిసి అస్సాంలోని ఓ స్కూల్లో ఒకే క్లాస్‌లో క‌లిసి చ‌దువుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత అనుష్క శ‌ర్మ స్టార్ హీరోయ‌న్ అయ్యి కోహ్లీని పెళ్లాడితే ధోనీని సాక్షి పెళ్లి చేసుకుంది.

5- అమీర్ ఖాన్ – సల్మాన్ ఖాన్:
బాలీవుడ్‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానే క్రేజీ హీరోలుగా ఉన్న అమీర్‌ఖాన్ – స‌ల్మాన్‌ఖాన్ ఇద్దరూ కూడా ఒకే క్లాసులో క‌లిసి చ‌దువుకున్నారు. ఇప్పుడు వీరిద్ద‌రు దేశాన్ని ఏలేసే స్టార్ హీరోలు అయ్యారు.

6 – ముఖేష్ అంబానీ – ఆనంద్ మహీంద్రా:
ఇక భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ పారిశ్రామిక వేత్త‌లుగా ఉన్న ముఖేష్ అంబానీ – ఆనంద్ మహీంద్రా ఇద్దరూ చిన్న‌ప్పుడు ఒకే స్కూల్లో.. ఒకే క్లాస్‌లో క‌లిసి చ‌దువుకున్నార‌ట‌.

7- బాల‌కృష్ణ – క‌దిరి బాబూరావు:
యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ , ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు చిన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లో క‌లిసి చ‌దువుకున్నారు. బాల‌య్య సిఫార్సుతోనే క‌దిరి బాబూరావుకు మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ వ‌చ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news