కరోనా సెకండరీ పాండమిక్ తర్వాత టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య అఖండ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పెద్ద సినిమాగా అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప ది రైజ్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న పుష్ప హంగామానే ఎక్కడ చూసినా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. యూఎస్‌లో ఈ రోజే ప్రీమియర్లు పడనున్నాయి.
పుష్ప తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీలోనూ వస్తోంది. పుష్పను తమిళ్‌లో లైకా వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. కన్నడ లో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్, హిందీలో ఏఏ ఫిలింస్ వారు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లు కూడా హిందీ మినహా అన్ని చోట్లా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో పుష్ప హంగామా అయితే మామూలుగా లేదు.
ఇక మిగిలిన సాంగ్స్ కంటే సమంత ఊ అంటావా మావా సాంగ్ అయితే తెలుగు నాట సినిమాకు మరింత హైప్ తెచ్చింది. అన్ని భాషల్లోనూ బుకింగ్స్ పుంజుకుంటున్నాయి. అయితే నార్త్‌లో మాత్రం పుష్పకు ఆశించిన స్థాయిలో కాదు కదా.. కనీసం ఓ మోస్తరుగా కూడా లేవని తెలుస్తోంది. బన్నీ మాత్రం ఈ సినిమాతో తనకు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఆశలు పెట్టుకున్నాడు.
ఒక వేళ నార్త్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోతే అప్పుడు బన్నీ పాన్ ఇండియా ఆశలు గల్లంతు అవుతాయి. ఈ బుకింగ్స్‌ను బట్టి చూస్తే నార్త్ లో ఫస్ట్ డే పుష్పకు ఆశించిన వసూళ్లు రాకపోవచ్చు. స్పైడర్‌మ్యాన్ రిలీజ్ కూడా పుష్పపై బాగా ప్రభావం చూపుతోంది. ఇక తెలుగు తర్వాత కన్నడ మార్కెట్ లో భారీ ఎత్తున బుకింగ్స్ నడుస్తున్నాయి. అటు ఫాహద్ ఫజిల్ కీలక పాత్ర తో మల్లూవుడ్ లోనూ బుకింగ్స్ బాగున్నాయి.