Moviesవ‌య‌సు పెరిగినా వ‌న్నె త‌గ్గ‌ని అందం: పింక్ చీర‌లో అన‌సూయ అందాలు..!

వ‌య‌సు పెరిగినా వ‌న్నె త‌గ్గ‌ని అందం: పింక్ చీర‌లో అన‌సూయ అందాలు..!

అనసూయ తెలుగు గడ్డపై ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు అనసూయకు తిరుగులేని క్రేజ్ ఉంది. మహా మహా స్టార్ హీరోయిన్లకే లేనంత అభిమానం అనసూయకు సొంతం. అసలు అనసూయని చూస్తుంటే ఆమె ఇద్దరు పిల్లల తల్లేనా ? అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి కూడా హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఉంటుంది. బుల్లి తెర మీద మాత్రమే కాదు… వెండితెర మీద కూడా అనసూయ దూసుకుపోతుంది.

తాజాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇక‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ హాట్ హాట్ అందాలతో వీక్ష‌కుల‌కు విందు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా పింక్‌ చీరలో ఉన్న ఫోటోని షేర్ చేసింది. గులాబి రంగు చీరలో ఈ అమ్మడి అందం చూస్తుంటే మామూలుగా లేదు.

సాంప్రదాయంగా ఉన్న ఈ ఫోటో షూట్ లో పసుపు పచ్చని బ్లౌజ్‌.. దానిపై గులాబీ రంగు చీరతో ఆమె అందాలు చూస్తుంటేనే మతిపోయేలా ఉంది. అనసూయ ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్సింగ్ తో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆమె ఎంత కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించినా… చాలా మంది ఆమె లుక్‌పై ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు.

ఇద్దరు పిల్లల తల్లి అయినా నీకు ఇంత హాట్‌ డ్రస్సులు అవసరమా ? అని విమర్శలు వచ్చినా అనసూయ మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గదు. తాను ఎలా ఉండాలి అనుకుంటున్నానో ? అలాగే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చే కామెంట్లు ఆమెకు మరింత క్రేజ్ తీసుకు వస్తున్నాయి. ఎప్పుడు కురచ దుస్తులతో హాట్ హాట్ దుస్తులతో కనిపించే అనసూయ… ఈసారి సాంప్రదాయంగా చీరలో కనిపించింది. చాలామంది మాత్రం అనసూయ ఈ వ‌య‌స్సులో ఇంత అంద‌మా ? అని కామెంట్లు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news