యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీసు దగ్గర అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. కరోనా తర్వాత అసలు పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయాలా వద్దా ? సినిమాలు రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూస్తారా ? గతంలోలా థియేటర్లలోకి జనాలు వస్తారా ? అని సినిమా వర్గాల్లో ఉన్న సందేహాలను పటాపంచలు చేసేసింది. సినిమాకు ఒక మోస్తరు టాక్ వచ్చినా కూడా తొలిరోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రభజనం క్రియేట్ చేసింది.
అఖండ సినిమా ఆడిన థియేటర్ల దగ్గర మాస్ జాతర తలపించింది. డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అయిన అఖండ 25 రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు థియేటర్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమాలు ఆడుతున్నా అఖండ ఆడుతోన్న థియేటర్లలో కలెక్షన్లు స్టడీగా వస్తున్నాయి. నాలుగో వారంలోనూ అఖండ చెప్పుకోదగ్గ వసూళ్ళు రాబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల థియేటర్లను మూసివేయడంతో అక్కడ కాస్త డల్ గా ఉన్నా… నైజాంలో అయితే ఇంకా తగ్గలేదు.
ఇక అఖండ వరుస రికార్డుల పరంపరలో మరో అదిరిపోయే రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు రు. 125 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు మాత్రమే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అఖండ సినిమా రు. 100 కోట్ల క్లబ్ లో చేరడం తో పాటు ఇప్పుడు రు. 125 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని చోట్ల భారీ లాభాలు తెచ్చిపెట్టింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌తో పాటు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్లు హైలెట్ గా నిలిచాయి. బాలయ్య సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా… ఈ సినిమాలో బాలయ్య మురళీకృష్ణ – అఖండగా కనిపించారు. ఇక బాలయ్య తన తర్వాత సినిమా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్.