రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా అఖండ మాట వినిపిస్తోంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా అఖండ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. విడుదలకు ముందే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానుల అంచనాలు నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సొంతం చేసుకొంది అఖండ.
మురళీకృష్ణ, శివుడిగా ద్విపాత్రాభినయంలో బాలయ్య అదరగొట్టేశారు. ముఖ్యంగా ఇ‘అఖండ’ సినిమ అలో అఘోరగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక జై బాలయ్య అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోయింది. సింగర్ గీతా మాధురి వాయిస్ ఈ పాటకు బాగా కలిసొచ్చింది. ఓవర్ ఆల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో అఖండ టీమ్ కు సోషల్‌మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అఖండ సినిమా నిర్మాతలందరినీ ఆనందానికి గురిచేసింది. దర్శకులు సినీ ప్రముఖులు కూడా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతుంది అనే నమ్మకంతో సంబరాలు చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య కు మరోసారి మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.
ఇక బాలయ్య కెరీర్‌లోనే ఈ సినిమా ద్వారా తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం. ట్రేడ్ నిపుణుల నుంచి అందిన సమాచారం మేరకు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోరూ. 49.34 కోట్లు షేర్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా…. రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. ఈ పది రోజుల్లో…
నైజాంలో రూ. 16.50 కోట్లు,
సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు,
ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు,
గుంటూరులో రూ. 3.96 కోట్లు,
ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు,
కృష్ణాలో రూ. 2.99 కోట్లు,
వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు,
నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద బాలయ్య సునామీ సృష్టించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.