యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెపుతున్నారు. సినిమా అంతా అదిరిపోయే, కళ్లు చెదిరే యాక్షన్ విజువల్స్‌తో సినిమా సూపర్ అన్న టాక్ వచ్చేసింది. ఇక ఇటీవల కాలంలో బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ స్థాయిలో నచ్చేంత సినిమా రాలేదని అంటున్నారు.
సినిమా చూస్తున్నంత సేపు బాలయ్య ఫ్యాన్స్ అయితే విజిల్స్, కేకలతో థియేటర్లు దద్దరిల్లి పోయేలా చేశారట. ఓవరాల్‌గా అఖండ హై ఓల్టేజ్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా. బాలయ్య అఘోరా క్యారెక్టర్ మతిపోయేలా బోయపాటి డిజైన్ చేస్తే.. ఆ పాత్రలో బాలయ్య ఆహార్యం, ఒదిగిన తీరు.. చెప్పిన డైలాగ్స్ అన్ని పవర్ ఫుల్‌గా ఉన్నాయి.
ఇక అఖండ అఘోరా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ సీన్ అయితే లెజెండ్‌ను మరపించేలా ఉందని.. ఆ ఒక్క సీన్ కోసమే సినిమాను పదే పదే రిపీటెడ్‌గా చూడొచ్చని అంటున్నారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు నూటికి రెండు వందలు మార్కులు వేయవచ్చని అంటున్నారు. అయితే సెకండాఫ్ లో సెంటిమెంటల్ సీన్లు వచ్చినప్పుడు సినిమా కాస్త స్లో అవ్వడం, అటు హీరోయిన్ క్యారెక్టర్‌కు సరైన ప్రాధాన్యం లేకపోవడం కాస్త మైనస్ అంటున్నారు.
బాలయ్య అభిమానులకు, నందమూరి అభిమానులకు, మాస్ జనాలకు మాత్రం మాంచి బిర్యాని లాంటి సినిమా బోయపాటి ఇచ్చాడని టాక్ వచ్చింది.