యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. మరోవైపు చాలాచోట్ల అనుమతులు లేవు. కొన్ని చోట్ల 50 శాతం కెపాసిటీ తోనే థియేటర్లను రన్ చేయాలన్నా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సంక్రాంతి టైంకు కరోనా కేసులు బాగా పెరుగుతాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతుందా అన్న ? సందేహాలు కూడా ఉన్నాయి.
అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 7వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రమోషన్లు నడుస్తున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి. ఇవన్ని ఇలా ఉంటే ఏపీలో మాత్రం ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఘోరంగా ఉంది. నిర్మాత దానయ్యతో ఆంధ్ర – సీడెడ్ బయ్యర్లు సమావేశం కానున్నారు. ఈ సినిమాను ఆంధ్రాలో రు. 100 కోట్లకు రు. 40 కోట్లకు అమ్మారు.
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాలయ్య అఖండ సినిమా వైజాగ్ లో అది రు. 6 కోట్ల వసూళ్లు రాబట్టింది. పుష్ప సినిమా కూడా అదే వైజాగ్ ఏరియాలో ఏడు కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో వైజాగ్ ఏరియాలో త్రిఫుల్ ఆర్ రు. 25 కోట్లు రాబట్టాలి. అయితే ఓ 20 రోజుల పాటు టిక్కెట్ రేటు యూనీఫామ్‌గా రు. 300 అమ్మితే తప్ప అధి సాధ్యం కాదు.
ఈస్ట్‌లో అఖండ, పుష్పకు రు. 4 కోట్లు రావడం గగనం అయ్యింది. అలాంటిది త్రిఫుల్ ఆర్ రు. 17 రాబట్టాలి. ఎంత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఉన్నా కూడా ఏపీలో ఇప్పుడు ఉన్న కరోనా కష్టకాలం… థియేటర్ల మూత, ఈ టిక్కెట్ రేట్లతో అందులో సగం రాబట్టడమే గొప్ప. ఇక బయ్యర్ల తరపున రాజమౌళి, సాయి కొర్రపాటి రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నా కూడా ఇప్పుడు అమ్మిన రేట్లలో సగం లేదా 60 శాతం తగ్గించాల్సిందే అని వారు పట్టుబడుతున్నారట.
ఏపీలో అమ్మిన రు. 140 కోట్లలో సగం కోత అంటే రు. 70 కోట్లు లాస్ అవ్వాలి. అదే జరిగితే నిర్మాత దానయ్యకు పెద్ద దెబ్బే తగులుతుంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి. ఏదేమైనా ఆర్ ఆర్‌కు రిలీజ్‌కు ముందు అన్ని కష్టాలుగానే కనిపిస్తున్నాయి.