Moviesషాకింగ్: విడాకులు తీసుకోనున్న మరో స్టార్ జంట..?

షాకింగ్: విడాకులు తీసుకోనున్న మరో స్టార్ జంట..?

ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయ్యిపోయింది. ముందు ఏమో మా మనసులు కలిసాయి అని లవ్ చేసుకోవడం..ఆ తరువాత ఇంట్లో వాళ్లని ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకోవడం..కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసాక..మోజు తీరిపోయి..మా మధ్య మనస్పర్ధలు ఎక్కువైయాయి..బాండింగ్ సరిగ్గా లేదు..మేం విడిపోతున్నం అంటూ ప్రకటించేయడం. ఇప్పటికే ఇలాంటి వార్తలు చాలా వినాం. ఇలాంటివి ఎక్కువ సెలబ్రిటీల జివితాల్లోనే జరుగుతుంటాయి ఏమిటో అసలు అర్ధంకాదు.

ఇక ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా భర్త కు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం రీసెంట్ గా ఆమె చేసిన పనే. ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక.. నిక్‌ జోనాస్‌ మ్యూజిక్‌ వీడియోల్లో కూడా ఒక్కోసారి మెరిసింది. పెళ్లయిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరును ‘ప్రియాంకా చోప్రా జోనాస్‌’గా మార్చుకుంది.

ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి దీపావళి పూజాకార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఏమైందో సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన పేరు చివర భర్త పేరు తీసేసిందీ బ్యూటీ. అంతే కాదండోయ్ త‌న ఇన్‌స్టాలో ప్ర‌తిదానికి మొద‌లంటూ ఒక‌టుంటుంది అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టుకుంది. కాగా 2018 డిసెంబర్‌ 2వ తేదీన ఈ గ్లోబల్‌ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చ‌ర్య‌లు బాలీవుడ్ వ‌ర్గాల‌కు అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. నిక్ నుంచి ప్రియాంక విడిపోనుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మరి వారి రిలేషన్‌కు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడాలంటే ప్రియాంక తన పేరు మార్చడంలో అంతర్యం ఏంటో క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో ఈ జంట వివాహం జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news