తెలుగు సినిమా చరిత్రలో ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఏడు దశాబ్దాల సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను కూడా రాజమౌళి తన సినిమాలతో తిరగరాయించేస్తున్నాడు. బాహుబలి రెండు సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై కూడా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి మళ్లీ అదే ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమాను తెరకెక్కించి రెండో సినిమాతోనే ఒక్కసారిగా యావత్ సినిమా ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. రాజమౌళి పేరును ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చిన సినిమా సింహాద్రి. అయితే ఈ సినిమా కథను రాజమౌళి ముందుగా బాలకృష్ణకు చెప్పాడట.
బాలయ్యకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం… వెంటనే ఆ కథ ఎన్టీఆర్‌కు చెప్పడం.. ఎన్టీఆర్ ఓకే చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. బాలయ్య ఈ కథ రిజెక్ట్ చేయడానికి ఓ కారణం కూడా ఉంది. అప్పటికే ఆయన వరుసగా ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. పైగా యజమాని దగ్గర పాలేరుగా ఉండే పాత్రలో తాను సూట్ అవుతానా ? అన్న సందేహం కూడా ఆయనకు వచ్చిందట.
ఇక అంతకు ముందు యేడాదే వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవరెడ్డి లాంటి సినిమా వచ్చింది. అది కూడా ఫ్యాక్షన్ సినిమా. అయితే అనుకున్న ఫలితం రాలేదు. ఈ కారణంతోనే బాలయ్య సింహాద్రి కథను వదులుకున్నాడు. అదే టైంలో బాలయ్య – బి.గోపాల్‌కు పలనాటి బ్రహ్మనాయుడుకు కమిట్ అయ్యారు. అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.