టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉంటారు. ఏ విషయంలో అయినా ఆయన ఎవ్వరిని బాధపెట్టేందుకు ఇష్టపడరు. మహేష్ ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కొన్ని సినిమాల్లో వయస్సులో తన కంటే పెద్ద వయస్సు ఉన్న హీరోయిన్లతో కూడా నటించారు. వీరిలో కొందరితో మాత్రం మహేష్‌కు ఎప్పటకి చెక్కు చెదరని అనుబంధం ఏర్పడింది. తన మూడో సినిమా వంశీలో నటించిన నమత్రా శిరోద్కర్ చివరకు మహేష్ భార్య అయ్యింది.
అలాగే అర్జున్ సినిమాలో మహేష్‌కు చెల్లిగా నటించిన కీర్తిరెడ్డితో బలమైన అన్నాచెళ్లెల్ల అనుబంధం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత కీర్తిరెడ్డి మహేష్‌ను అన్నయ్యా పిలుస్తూ ఉండేది. రాఖీ పండగకు మహేష్‌కు రాఖీ కట్టేది. అలాగే మహేష్ కూడా కీర్తిరెడ్డిని సోదరిలాగనే చూసుకునేవాడు. అలాంటి కీర్తిరెడ్డి విషయంలో మహేష్ చాలా బాధపడ్డాడట. అదే కీర్తిరెడ్డి సుమంత్ విడాకుల విషయం.
కీర్తిరెడ్డి పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే అక్కినేని మనవడు సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన యేడాదికే మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. వీరిని కలిపేందుకు మహేష్ ఎన్నో ప్రయత్నాలు చేసినా వీరు మాత్రం ఎవరిదారుల్లో వారు ఉండేందుకే ఇష్టపడ్డారు అట. చివరకు మహేష్ కూడా చేసేదేం లేకపోవడంతో వదిలేశాడట.
అయితే కీర్తిరెడ్డి జీవితం అలా అవ్వడం అప్పట్లో మహేష్ మనసును బాధ పెట్టిందనే అంటారు. ఇక సుమంత్‌కు విడాకులు ఇచ్చిన కీర్తిరెడ్డి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఆమె నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డికి స్వయానా మనవరాలు. ఇక సుమంత్ మాత్రం ఇప్పటకీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు.