టాలీవుడ్ లో మన స్టార్ హీరోలు అందరూ ఒక వైపు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటూనే… మరోవైపు అనేక వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఇప్పటినుంచి ఉన్నది కాదు… సీనియర్ నటుడు శోభన్ బాబు సినిమాల్లో స్టార్ గా కొనసాగుతున్నప్పుడే బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు పడగలెత్తుతారు. శోభన్‌బాబు తిరుగులేని రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యారు. తర్వాత ఆయన బాటలోనే మరో సీనియర్ నటుడు మురళీ మోహన్ సైతం రియల్ ఎస్టేట్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు.
ఇక సీనియర్ హీరోల్లో చిరంజీవి – నాగార్జున సైతం పలు రకాల బిజినెస్లు చేశారు. వీరిద్దరు రియల్ ఎస్టేట్‌తో పాటు మా టీవీని కూడా కొన్ని రోజుల పాటు రన్ చేసి మంచి లాభానికి అమ్ముకున్నారు. నాగార్జున అయితే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో భారీ ఎత్తున భూములు కొన్నాడనే అంటారు. ఇక ఇప్పటి తరం స్టార్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు – అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం రకరకాల బిజినెస్ లు చేస్తున్నారు.
మహేష్ బాబు ఒక్కో సినిమాకు రు. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు లాభాల్లో వాటా కూడా అడుగుతున్నారు. అలాగే మహేష్ బాబుకు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. అయితే మహేష్ స్లీపింగ్ పార్టనర్ గా ఉంటాడని టాక్.
హైదరాబాద్‌కే తలమానికమైన ఏఎంబీ మల్టీప్లెక్స్ కూడా మహేష్ బాబు భాగస్వామి. ఈ మల్టీఫ్లెక్స్ బిజినెస్ భారీగా లాభాలు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో మరో మల్టీప్లెక్స్ సైతం మహేష్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇది కాకుండా భార్య నమ్రతతో కలిసి దుస్తుల వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు.