టీం ఇండియా మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అజారుద్దీన్ తన ఆటతోనే కాదు.. అందంతో కూడా ఎంతో మంది మనస్సులు కొల్లగొట్టేవాడు. 1985 – 1995 మధ్య కాలంలో అజారుద్దీన్ అంటే ఇండియాలో ఓ క్రేజ్. సుధీర్ఘకాలం మన టీం ఇండియా క్రికెట్ టీంకు అజార్ కెప్టెన్‌గా ఉండేవాడు. 1992 – 1996 – 1999 మూడు వరల్డ్‌కప్‌లలో మన జట్టుకు అజారే కెప్టెన్‌గా ఉండేవాడు.
ఇక అజార్ వ్యక్తిగత జీవితం మాత్రం ఏమంత సాఫీగా సాగలేదు. ముందుగా నౌరీన్‌తో అజార్‌కు పెళ్లయ్యింది. ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు. ఆ తర్వాత మనోడు స్టార్ క్రికెటర్‌గా ఉండడంతో పలు వ్యాపార ప్రకటనలను ప్రమోట్ చేసేవారు. ఓ యాడ్ షూటింగ్‌లో అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంగీత బిజ్లానీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
వీరిద్దరు సన్నిహితంగా ఉన్న విషయం తెలుసుకున్న అజార్ భార్య నౌరీన్ అజార్‌కు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత అజార్ సంగీత బిజ్లానీని పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల కాపురం తర్వాత అజార్ సంగీతకు కూడా దూరమయ్యాడు. అజార్ తనను మోసం చేశాడంటూ సంగీతయే స్వయంగా చెప్పింది. అజార్ సంగీతకు దూరం కావడానికి ఓ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారణితో ఉన్న ఎఫైరే కారణమన్న ప్రచారం ఉంది.
సంగీత బిజ్లానీ – సల్మాన్ ప్రేమాయణం:
అజార్‌ను పెళ్లి చేసుకునేముందు సంగీత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను పిచ్చగా ప్రేమించింది. సంగీత 1990లలో బాలీవుడ్ ను షేక్ చేసిన అందగత్తె. అప్పట్లో ఆమె కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపే హాట్ హీరోయిన్. సల్మాన్‌ను ఆమె పెళ్లి చేసుకుంటుందన్న ప్రచారం కూడా జరిగింది. పెద్ద వాళ్లు కూడా వీరి ప్రేమకు జెండా ఊపారు. అయితే చివర్లో అనూహ్యంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అజ్జూ ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది.