దివంగత వర్థమాన హీరో ఉదయ్ కిరణ్ నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ను గుర్తు పెట్టుకున్నారు అంటే ఉదయ్ ఎంత మంచి నటుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయ్ కిరణ్ నటించిన ఏ సినిమాలో అయినా సరే చాలా నేచురల్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే వారు. కానీ ఆయన డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తీసుకొన్న నిర్ణయం ఏకంగా తన ప్రాణాలను తీసుకెళ్లి పోయింది.
చిత్రం , మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు సొంత పెట్టుబడితో తీసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఆర్థికంగా కూడా నష్టపోయాడు. చివరకు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముఖ్యంగా ఉదయ్ కిరణ్ నటించిన రెండు, మూడు సినిమాలకు వి.యన్.ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీ రామ్ సినిమా తర్వాత చిరంజీవి సినిమాకు ముహూర్తం కూడా జరిగి మధ్యలోనే ఆగిపోయింది.. ఇక మలయాళ రీమేక్ ను చిరంజీవిగారితో చేద్దామని అనుకున్నాము.. ఆ కథ ఇంద్ర కథకు దగ్గర కావడంతో తనకు నచ్చలేదని, అందుకే చిరంజీవి చేయనని చెప్పడంతో సినిమా ను ఆపి వేశామని ఆదిత్య తెలిపారు.
శ్రీరామ్ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ అనుకోని కారణం చేత కో-డైరెక్టర్ ని బాగా తిట్టాడట. ఏనాడు డైరెక్టర్లను ఒక్కమాట కూడా తప్పుగా అనకూడదని.. సినిమాల వల్ల వచ్చిన ఫ్రస్టేషన్లో ఉదయ్ కిరణ్ ఆ కో-డైరెక్టర్ పై బాగా విరుచుకు పడ్డాడు అని ఆదిత్య చెప్పారు. అప్పుడు తాను వెంటనే బ్యాకప్ చెప్పేసి వచ్చేసాను.. ఇక ఉదయ్ కిరణ్ వేరే సినిమా రిలీజ్ విషయంలో వచ్చిన సమస్యల వల్లే తట్టుకోలేక ఆ విధంగా ప్రవర్తించాడని ఆదిత్య తెలిపారు.