తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎంత గొప్ప నటుడు తెలిసిందే. 1970 – 80 వ దశకంలో కృష్ణంరాజు అంటే నిజంగానే ఓ రెబల్ స్టార్ అన్నట్టుగా ఉండేది. ఆయన తన పవర్ఫుల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయారు. కృష్ణంరాజు తర్వాత ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు సినిమా రంగంలోనే తిరుగులేని స్టార్ హీరో కావడంతో పాటు ఏకంగా ఇండియా స్టార్ అయిపోయాడు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మానియా దేశాన్ని ఎలా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక కృష్ణంరాజు విషయానికి వస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు భార్య శ్యామల దేవి అందరికీ తెలిసిన వారే. ఆమెతో కలిసి కృష్ణంరాజు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి గురించి చాలా మందికి తెలియదు.
కృష్ణంరాజు మొదటి భార్య ఎవరు ? ఆయన రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అన్నది ఈ తరం జనరేషన్ వాళ్లకు తెలియదు. కృష్ణంరాజు మొదటిగా సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే 1995లో సీతాదేవి ఒక కారు ప్రమాదంలో మరణించారు. దీంతో కొద్ది రోజుల పాటు కృష్ణంరాజు డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. ఆ తర్వాత బంధువుల సూచన మేరకు శ్యామలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా… మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి కుమార్తెకు కూడా పెళ్లి అయింది. ఆమెకు ఒక పాప ఉన్నారు. తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే వాళ్లలో చాలామంది భార్యకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటే కృష్ణంరాజు మాత్రం భార్య మరణించాక మాత్రమే తనకు ఓ తోడు కావాలని శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.