మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా రంగంలో ఇప్పుడో స్టార్ డైరెక్టర్. ఎన్నో సినిమాలకు ఉత్తమ కథకుడిగా, రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రెండో సినిమాతోనే ఏకంగా ప్రిన్స్ మహేష్‌బాబును అతడు సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి త్రివిక్రమ్ పట్టిందల్లా బంగారం అయిపోయింది. త్రివిక్రమ్‌కు తిరుగులేకుండా పోయింది. మధ్యలో అజ్ఞాతవాసి సినిమాతో ఘోరమైన డిజాస్టర్ కొట్టినా కూడా ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అరవింద సమేత వీరరాఘవ, బన్నీతో అల వైకుంఠపురములో సినిమాలతో మరోసారి శిఖరంపై నిలుచున్నాడు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకునే విషయంలో త్రివిక్రమ్ అష్టకష్టాలు పడ్డారు. ఈ విషయం తెలిసిందే. త్రివిక్రమ్ , కమెడియన్ సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ. పట్నాయక్ ఈ ముగ్గురూ కూడా మంచి స్నేహితులు. ఇక సునీల్- త్రివిక్రమ్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్. వీరు కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో వారికే తెలుసు. వీరు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే టైంలో పంజాగుట్టలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవారు అట. వీరితో పాటు సంతోషం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దశరథ్ కూడా వీరితో పాటే ఉండేవారు అట.
అయితే త్రివిక్రమ్ తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఆ రూమ్‌ను ఇప్పటకీ వదులుకోలేదట. తనకు కలిసొచ్చిన ఆ రూమ్‌పై ఉన్న మమకారంతో ఇప్పటకీ ఆ రూమ్‌ను తన పేరు మీదే ఉంచుకుంటున్నాడట. అందుకే ప్రతి నెలా ఆ రూమ్‌కు రు. 5 వేలు రెంట్ కడుతూనే ఉన్నాడట. అంతే కాదు.. ఇప్పటకీ కూడా ముందుగా ఏదైనా కథ మొదలు పెట్టాలన్నా.. కథలు రాయాలన్నా కూడా ఆ రూమ్ నుంచే ప్రారంభిస్తాడట. అది ఆ రూమ్ సెంటిమెంట్.