తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి యావత్ తెలుగు జాతిని విషాదంలోకి నెట్టేసింది. 37 ఏళ్ల జీవితంలో సిరివెన్నెల ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సిరివెన్నెలగా నిలిచిపోయారు. కొద్ది రోజులుగా న్యూమోనియోతో బాధపడుతోన్న ఆయన ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యి మృతిచెందారు.
ఇక టాలీవుడ్ స్టార్ రైటర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిరివెన్నెలకు వరుసకు అల్లుడు అవుతారు. విచిత్రం ఏంటంటే త్రివిక్రమ్ పెళ్లిసంబంధం కుదిర్చిందే సిరివెన్నెల. త్రివిక్రమ్ రైటర్‌గా ఉండి 2002లో నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ అయ్యారు. అంతకు ముందే ఆయనలో టాలెంట్ గుర్తించిన త్రివిక్రమ్ తన సోదరుడు కుమార్తెకు ఇచ్చి అల్లుడిని చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
అలా త్రివిక్రమ్ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లారు. అయితే పెళ్లి చూపుల్లో చిన్న ట్విస్ట్. త్రివిక్రమ్‌కు తాను పెళ్లి చూపుల్లో చూసిన అక్క కంటే చెల్లి నచ్చింది. అయితే ఈ విషయాన్ని సిరివెన్నెలకు చెప్పి.. తాను చెళ్లినే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. అయితే ముందు సిరివెన్నెల కాస్త తటపటాయించినా.. చివరకు తన సోదరుడికి ఈ విషయాన్ని చెప్పడంతో పాటు వారిని కన్విన్స్ చేశారు.
అలా అక్క పెళ్లి అయ్యాక.. చెల్లినే త్రివిక్రమ్ పెళ్లాడారు. సిరివెన్నెల సోదరుడి రెండో కుమార్తె సౌజన్యతో త్రివిక్రమ్‌కు పెళ్లి జరిగింది. అలా సిరివెన్నెలకు త్రివిక్రమ్ అల్లుడు అయ్యారు. ఇక సౌజన్యతో పెళ్లి అయ్యాక త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్ అయ్యారు. అప్పటి నుంచి త్రివిక్రమ్‌కు పట్టింది అల్లా బంగారం అయ్యింది.
అయితే త్రివిక్రమ్‌కు సిరివెన్నెల వరుసకు మామ గారు అయినా కూడా.. త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ గురువు గారు అంటూ అలాగే సంబోధించేవారు.