సినిమా ఇండస్ట్రీలో రూమర్లు అనేవి చాలా కామన్. ఒకే కాంబినేషన్ పదే పదే రిపీట్ అయితే ఈ అనుమానాలు చాలా ఎక్కువగానే వినిపిస్తూ ఉంటాయి. ఏ ఇద్దరు చనువుగా ఉన్నా కూడా వారి మధ్య ఏదో లింకులు ఉన్నాయన్న సందేహాలు కామన్. ఈ క్రమంలోనే నటి పూర్ణకు డైరెక్టర్ రవిబాబుకు మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాలుగా ఈ వార్తలు ఉండనే ఉన్నాయి. ఇందుకు కారణం రవి బాబు దర్శకత్వంలో పూర్ణ వరుసగా సినిమాలు చేసింది.
రవిబాబు డైరెక్ట్ చేసిన అవును, అవును 2 తో పాటు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన లడ్డుబాబు లో కూడా ఆమే హీరోయిన్. ఇలా వరుసగా పూర్ణ రవిబాబు సినిమాల్లో లీడ్ రోల్ చేయడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమనడానికి కారణమయ్యాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే తన తాజా ఇంటర్వ్యూలో రవిబాబు ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ అబద్ధాలే అని కొట్టి పడేశారు. షూటింగ్ అయిపోయాక తాను ఏ హీరోయిన్‌తో కూడా మాట్లాడనని.. కనీసం వారికి ఫోన్ కూడా చేయనని రవిబాబు చెప్పారు. తాను ముందు నుంచి విలువలకే ప్రాధాన్యత ఇస్తానని రవిబాబు చెప్పాడు.
తాను వేధించే వ్యక్తినే అయితే వరుసగా తనతో సినిమాలు ఎందుకు చేస్తారని.. పూర్ణ నటన మెచ్చే తాను ఆమెకు వరుసగా ఆఫర్లు ఇచ్చానని చెప్పారు.