అరాచకాలు అంతమయ్యాక కొన్ని దేశాలు నియంతల చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరి ఏకచ్ఛత్రాధిపత్యం లో ఏం చెప్పినా అదే శాసనం అయ్యేది. అంతేకాదు వారి అధికార దర్పానికి ఎవరు అడ్డొచ్చిన సరే అంతు చూసేవారు. ఇగో, అసూయతో యుద్ధాలకు దిగి సామాన్య ప్రజల సంక్షేమ, భద్రత ఇలాంటివేవీ కూడా వీరు పట్టించుకునేవారు కాదు.. వీరి ఆహార అలవాట్లు విషయానికి వచ్చే సరికి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకునే వారట. అలా చరిత్రలో మిగిలిపోయిన కొందరు క్రూర నియంతల ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అడాల్ఫ్ హిట్లర్:
1933 – 1945 మధ్య కాలంలో జర్మనీ ని పరిపాలించిన అడాల్ఫ్ హిట్లర్ ఒకనొక సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించాడు. అయితే ఈయన పూర్తిగా శాఖాహారి కావడంతో బంగాళదుంప పులుసు తో మాత్రమే భోజనం చేసేవారు. ఎందుకంటే ఈయనకున్న దీర్ఘకాలిక అపానవాయువు, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయని బాగా నమ్మేవాడు హిట్లర్.
2. కిమ్ జోంగ్ హిల్:
ఉత్తర కొరియాలో గత మూడు తరాలుగా వీరి కుటుంబమే దేశాన్ని ఏలుతోంది. అందులో రెండవ తరానికి చెందిన వ్యక్తి ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ హిల్ కు షార్క్ ఫిన్ సూప్, కుక్క మాంసం తో చేసిన సూప్ అంటే ఎంతో ఇష్టం గా తాగే వారట. ఇతడు తినడానికి కంటే ముందే కొన్ని పదుల సంఖ్యలో మహిళలు దాని రుచి చూసిన తర్వాతనే ఈయన తినేవారట.
3. ఈదీ అమీన్:
ఉగాండా దేశాన్ని పరిపాలించిన ఏకైక సైనిక అధికారి.. ఈయన 1971 నుండి 1979 వరకు దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడం గమనార్హం. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన నియంతలలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇకపోతే ఇతడు రోజుకు 40 బత్తాయి పండ్లు , కెఎఫ్సి చికెన్ బాగా తింటారట. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో టీ తాగుతారట.. అంతేకాదు ఇతడు నరమాంస భక్షకుడు అనే వార్తలు కూడా ఇతనిపై ఉన్నాయి.
4. బెనిటో ముస్సాలిని:
ఈయన జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి , ఆ తర్వాత ఇటలీ ప్రధానమంత్రి గా 1922 లో బాధ్యతలు స్వీకరించాడు. ఇకపోతే ఈయనకు వెల్లుల్లి తో చేసిన సలాడ్ అంటే చాలా ఇష్టమట.. వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసి వాటిపై నిమ్మరసం, నూనె పోసుకొని తినేవారట.
5. జోసెఫ్ స్టాలిన్:
ఒకప్పటి సోవియట్ యూనియన్ కు ప్రీమియర్ ఈయన. సోవియట్ లో నియంతృత్వ పాలన సాగించారు. జార్జియా కు చెందిన ఈయన కు ఆ దేశ సాంప్రదాయ వంటకాలు అంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా వాల్నట్స్, దానిమ్మ పండ్లు, రేగు పండ్లు బాగా తినేవారట.