రాజకుమారుడు సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్‌బాబు. 22 సంవత్సరాల కెరీర్‌లో మహేష్‌బాబు ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. అయితే వరుస హిట్లతో మహేష్ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. మహేష్‌కు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ కోకొల్లులుగా అభిమానులు ఉన్నారు. మహేష్‌బాబు నటించిన చివరి మూడు సినిమాలు భరత్ అనేనేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టాయి.
అయితే మహేష్ కెరీర్‌లో కొన్ని సినిమాలు స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా కూడా ఆగిపోయాయి. ఆ సినిమాలు, వివరాలు ఏంటో చూద్దాం. మహేష్ రిజెక్ట్ చేసిన వాటిల్లో 24 – ఇడియట్ – గజనీ లాంటి సినిమాలు కూడా ఉన్నాయట. ఇక అఫీషియల్‌గా ప్రకటించాక కూడా షూటింగ్‌కు వెళ్లకుండా ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
అర్జున్ తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో సైన్యం సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సైనికుడు ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కేసింది. వీడు చాలా హాట్ గురూ సినిమాను ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి హేమంబర్ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సి ఉన్నా అది పట్టాలు ఎక్కలేదు. ఖలేజా లేట్ అవ్వడంతో ఈ సినిమా ఆగిపోయింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ ఊరమాస్ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇది కూడా పట్టాలెక్కలేదు. ఇక మహేష్ – కరిష్మా కపూర్ జంటగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే దూకుడు కు ఓకే చెప్పడంతో ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాకు అప్పట్లోనే రు. 40 కోట్ల బడ్జెట్ అనుకున్నారు.
2013లో మహేష్ – మణిరత్నం కాంబోలో ఓ సినిమా అనుకున్నా కుదర్లేదు. అత్తారింటికి దారేది తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో హరేరామ – హరేకృష్ణ సినిమా అనుకున్నా అది కుదర్లేదు. ఆ తర్వాత 2016లో పూరి – మహేష్ కాంబోలో జనగణమన సినిమా పట్టాలెక్కేస్తుందనే అనుకున్నారు. మహేష్‌కు పూరిపై నమ్మకం లేకే ఆ సినిమా ఆగిపోయింది.
ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా రావాల్సి ఉంది. అయితే వంశీ చెప్పిన సెకండాఫ్ మహేష్‌కు నచ్చలేదు. దీంతో ఇప్పుడు సర్కారువారి పాట చేస్తున్నాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో నటిస్తోన్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్.. ఆ తర్వాత రాజమౌళి సినిమాలను లైన్లో పెట్టాడు.