యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు వరుస హిట్లతో ఉన్న ఎన్టీఆర్ వచ్చే సంక్రాంతి కానుకగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎంతో మంది డైరెక్టర్లను నమ్మి వాళ్లతో సినిమాలు చేశాడు. వాళ్లలో హిట్లు ఇచ్చిన వారు ఉన్నారు.. ప్లాపులు ఇచ్చిన వారు ఉన్నారు. అయితే ఓ ఇద్దరు దర్శకులను మాత్రం ఎన్టీఆర్ గుడ్డిగా నమ్మేసి రెండేసి సినిమాలకు ఛాన్సులు ఇచ్చాడు. వారిద్దరు ఎన్టీఆర్ ఇచ్చిన రెండు ఛాన్సులను కూడా వేస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌కు పెద్ద ప్లాప్ సినిమాలు ఇచ్చాడు.
అసలు మెహర్ రమేష్ మెగా కాంపౌండ్ బంధువు. అక్కడ వాళ్లే ఛాన్సులు ఇవ్వకపోతే ఎన్టీఆర్ కంత్రితో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. కంత్రి ప్లాప్ అయ్యింది. అయితే శక్తి కథ వినిపించిన మెహర్ రమేష్ మనం మగధీర రికార్డులు బద్దలు కొట్టేస్తాం అని కహానీలు చెప్పేసి మళ్లీ ఎన్టీఆర్‌ను ఒప్పించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. అటు అశ్వనీదత్ ఈ సినిమా పరాజయం నుంచి కోలుకోవడానికి యేళ్లే పట్టింది. ఇక మెహర్ రమేష్ ను ఎన్టీఆర్ దూరం పెట్టడంతో అటు ఇటూ తిరిగి మహేష్‌బాబుకు యాడ్లు చేస్తూ ఇప్పుడు చిరంజీవితో మళ్లీ భోళా శంకర్ అంటూ ఓ ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఇక ఎన్టీఆర్‌ను దారుణంగా దెబ్బేసిన మరో డైరెక్టర్ సురేందర్‌రెడ్డి. ముందుగా అశోక్ సినిమాతో తొలి ఛాన్స్ ఇచ్చాడు. అశోక్ కథ సంగతి ఎలా ఉన్నా కనీసం ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను కూడా సరిగా డిజైన్ చేయలేకపోయాడు. ఇక మరోసారి ఊసరవెల్లి సినిమాతో ఛాన్స్ ఇస్తే.. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల ప్లాపు తర్వాత సురేందర్‌రెడ్డికి ఎన్టీఆర్ మరోసారి ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అశోక్, ఊసరవెల్లి సినిమాలు హిట్ అయ్యి ఉంటే అదే టైంలో ఎన్టీఆర్ రేంజ్ మరో స్థాయిలో ఉండేది. కానీ సురేందర్‌రెడ్డి ఎన్టీఆర్‌కు ఘోరంగా దెబ్బేశాడు.