యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు. ఆయనతో మాట్లాడాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే వాస్తవంగా మాత్రం ఆయన మనసు వెన్న అన్నది తెలిసిందే. బాలయ్య గురించి తెలిసిన వారికి మాత్రమే ఆయన మనసు ఎలాంటిది ? అయన ఇతరుల పట్ల ఎంత ప్రేమతో ఉంటారో తెలుస్తుంది. ఇప్పటికే వెండి తెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ షోలతో కూడా బిజీ బిజీ అయిపోతున్నాడు.
ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఈ క్రమంలోనే బాలయ్యతో పాండురంగడు సినిమాలో నటించిన అర్చన ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పింది. తనకు టాలీవుడ్ హీరోయిన్లతో పెద్ద సన్నిహితం లేదని చెప్పిన అర్చన బాలయ్యకు భయపడే వారు అంటే అస్సలు నచ్చదు అని.. ఆయన చాలా కూల్‌గానే ఉంటారని చెప్పింది.
ఇక బాలయ్యకు డ్రామాలు చేసే వారు అంటే అస్సలు నచ్చదని అర్చన చెప్పింది. బాలయ్య షూటింగ్ స్పాట్‌లోకి వస్తున్నారు అంటే అక్కడ ఉన్నవారంతా ఒక్కటే భయపడిపోతారని అర్చన తెలిపింది. ఇక రాఘవేంద్రరావుకి నచ్చేలా తాను ఓ పాటను కంపేరిజన్ చేయడంతో బాలయ్య తనను ప్రశంసించారని సంతోషం వ్యక్తం చేసింది. బాలయ్య గురించి బయట అనుకునేది వేరని.. కానీ ఆయన మాత్రం చాలా మంచి వ్యక్తి అని.. అందరిని గౌరవిస్తూ.. ఎంతో మర్యాదగా ఉంటారని చెప్పింది.