Moviesషూటింగ్‌లోనే ఆ హీరోయిన్‌తో సిద్ధార్థ్ మిస్ బిహేవ్‌... పెద్ద గొడ‌వ‌...!

షూటింగ్‌లోనే ఆ హీరోయిన్‌తో సిద్ధార్థ్ మిస్ బిహేవ్‌… పెద్ద గొడ‌వ‌…!

కోలీవుడ్ వాడు అయినా కూడా సిద్ధార్థ్ తెలుగు వాళ్ల‌కు కూడా బాగా ప‌రిచ‌యం. ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ్‌కు త‌మిళ్‌లో కంటే తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఇక్క‌డే బొమ్మ‌రిల్లు, న‌వ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టాడు. మ‌న తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా సిద్ధార్థ్‌ను తెలుగు వాడిగానే చూస్తారు. అయితే కెరీర్‌లో వేసిన రాంగ్‌స్టెప్పుల కార‌ణంగా సిద్ధార్థ్‌కు గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ రావ‌ట్లేదు. ఇటీవ‌ల చేసిన మ‌హాస‌ముద్రం కూడా ప్లాప్ అయ్యింది.

ఇక సిద్ధార్థ్ చాలా మంది హీరోయిన్ల‌తో రొమాంటిక్ ట్రాకులు న‌డిపాడ‌న్న ప్ర‌చారం ఉంది. సిద్ధార్థ్‌కు పెళ్ల‌య్యి ఓ బాబు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత అత‌డు హ‌న్సిక‌, శృతీహాస‌న్‌, స‌మంత, త్రిష‌ లాంటి స్టార్ హీరోయిన్ల‌తో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌లు న‌డిపాడ‌న్న గుస‌గుస‌లు అప్ప‌ట్లో వినిపించాయి. ఇక స‌మంత‌ను అత‌డు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లినా చివ‌ర్లో బ్రేక‌ప్ అయ్యింద‌ని అంటారు.

అయితే ఓయ్ సినిమా షూటింగ్ వైజాగ్లో జ‌రుగుతుండ‌గా హీరోయిన్ షాలినితో మిస్ బిహేవ్ చేశాడంటూ ఆమె ఆరోపించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది. నిజానికి ఆ సినిమాలో హీరో – హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా పండ‌లేద‌ని.. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డానికి అది కూడా ఓ కార‌ణం అంటారు. సిద్ధార్థ్ ఓవ‌ర్‌గా బిహేవ్ చేసి త‌న‌కు ద‌గ్గ‌ర‌య్యేంద‌కు ట్రై చేశాడ‌ని షాలిని ఆరోపించింది.

త‌ర్వాత అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌తో ఇబ్బంది ప‌డిన ఆమె ఆ సినిమాను వ‌దిలేయాల‌నే అనుకుంద‌ట‌. అయితే ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా న‌ష్ట‌పోతామ‌ని క‌న్వీన్స్ చేయ‌డంతో చివ‌ర‌కు ఏదోలా ఆ సినిమా పూర్తి చేశాన‌ని వాపోయింది. ఈ క్ర‌మంలోనే సిద్ధార్థ్‌తో కౌగిలింత‌ల సీన్‌తో పాటు ముద్దులు పెట్టే సీన్లు వ‌ద్ద‌ని మ‌రీ కండీష‌న్లు పెట్టింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news