టాలీవుడ్ లో వారసత్వం ఎక్కువగా కొనసాగుతూ వస్తోంది. నందమూరి, అక్కినేని కుటుంబంలో మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మనకు తెలియని బంధుత్వాలు కూడా చాలా ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ రిలేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. దివంగత అలనాటి సీనియర్ నటి సావిత్రి బాలీవుడ్ నటి రేఖకు వరుసకు పిన్ని అవుతుంది. రేఖ తల్లి పుష్పవల్లి జెమినీ గణేషన్ భార్య. ఆ బంధుత్వం నేపథ్యంలోనే సావిత్రి రేఖకు పిన్ని అవుతుంది.
కళాతపస్వి కె.విశ్వనాథ్ , దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నటుడు చంద్రమోహన్ అన్నదమ్ములు అవుతారు. అలాగే ప్రముఖ దర్శకురాలు, సీనియర్ నటి విజయనిర్మలకు సహజనటి జయసుధ మేనకోడలు అవుతుంది. ఈ లెక్కన సూపర్ స్టార్ కృష్ణకు కూడా జయసుధ మేడనకోడలే. ఇక నాటి అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవికి అక్క కూతురు హీరోయిన్ మహేశ్వరి.
విశ్వ నటుడు కమల్ హాసన్ కు సుహాసిని కూతురు అవుతుంది. కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ కూతురే సుహాసిని. ఇక సుహాసిని – శృతిహాసన్ అక్క చెల్లెలు అవుతారు. అలాగే హీరో సందీప్ కిషన్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడకు స్వయానా మేనళ్లుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మన్, యాక్టర్ రెహ్మన్ సొంత తోడళ్లుల్లు. వీరి భార్యలు సొంత అక్కా చెళ్లెల్లు.
అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలినే పెళ్లాడారు. ఈ లెక్కన సిరివెన్నెలకు త్రివిక్రమ్ కొడుకు అవుతారు. పోసాని కృష్ణమురళీకి దర్శకుడు కొరటాల శివ మేనళ్లుడు అవుతారు. చైల్డ్ ఆర్టిస్ట్, బుల్లితెర నటి సుజిత అన్నే డైరెక్టర్ సూర్య కిరణ్. అలాగే హీరోయిన్ కళ్యాణి సూర్య కిరణ్కు భార్య కావడంతో సుజిత కళ్యాణికి ఆడపడుచు అయ్యింది.
ఇక సీనియర్ హీరోయిన్ శోభనకు వినీత్ కజిన్ అవుతాడు. ఇక హీరో శ్రీకాంత్ మేనకోడలినే గోపీచంద్ పెళ్లి చేసుకోవడంతో వారు బంధువులు అయ్యారు. డైరెక్టర్ మెహర్ రమేష్. మెగాస్టార్ చిరంజీవికి వరుసకు తమ్ముడు. నాగబాబు వైపు నుంచి వీరి బంధుత్వం ఉంది.