కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ లేటెస్ట్ గా ఓ రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.ఈ హీరోయిన్ ఇటీవల ‘లవ్ యూ రచ్చు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందంటూ పలు విమర్శలు వచ్చాయి. ఆమె హీరోయిన్ గా నటించిన ‘లవ్ యూ రచ్చు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
రిపోర్టర్ రచితను‘లవ్ యూ రచ్చు’ సినిమాలో కొద్దిగా ఘాటైన రొమాన్స్ చేసినట్టున్నారు.. అని అడగ్గా ఆమె కథ డిమాండ్ చేయడంతో తప్పలేదు అని ఆన్సర్ చెప్పింది. దానికి రిపోర్టర్ మళ్లి అంతకు ముందు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో చేయను అని చెప్పారుగా.. మధ్యలో రచిత మాట్లాడుతూ ” నేను మిమ్మల్ని అడుగుతున్నాను సాధారణంగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో చెప్పండి?” అని అడిగింది. జర్నలిస్ట్ తిరిగి సమాధానం ఇవ్వబోతుండగా “రొమాన్స్ చేస్తారు. కరెక్ట్ కదా ? అదే చిత్రంలో చూపించాము” అంటూ తాను సినిమాల్లో బోల్డ్ కామెంట్స్ చేయడాన్ని సమర్థించుకుంది.
ఇక ఆమె వ్యాఖ్యలు పై కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగస్వామి మండిపడ్డారు. రచిత అటువంటి ప్రకటనలు చేయడం సరైనది కాదు అంటూ ఫైర్ అయ్యారు. ఆమెపై నిషేధం విధించాలని ఫిల్మ్ ఛాంబర్ కు రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా ‘లవ్ యూ రాచు’ చిత్రం విడుదలకు అనుమతించబోమని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఆమె చాలా అసభ్యంగా మాట్లాడి పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసింది అంటూ ఫైర్ అయ్యారు. ఇది ఇలా ఉందగా మరోవైపు ప్రస్తుతం రచిత రామ్ ఏకంగా 15 చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో దాదాపు అన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా వదిలేస్తే… ఏక కాలంలో అన్ని చిత్రాలలో నటించడం నిజంగా గొప్ప విషయమే అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.