Gossipsవారెవ్వా..అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న రష్మీ.. మెగాస్టార్‌తో మాస్ డ్యాన్స్..?

వారెవ్వా..అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న రష్మీ.. మెగాస్టార్‌తో మాస్ డ్యాన్స్..?

రష్మీ.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం చేయ్యాల్సిన పని లేదు. తన అందంతో బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. అమ్మడు యాంకర్ గానే కాకుండా కొన్ని సినిమాలో హీరోయిన్ గా..మరి కొన్ని సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ గా కూడా నతించింది. రష్మి గౌతమ్ ఒక్కప్పుడు హీరోయిన్‌గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ వస్తోంది. అంతే కాదు…ముఖ్యంగా చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ… చాన్స్ లు మీద ఛాన్స్ లు కొట్టేస్తూ …..ఈ హాట్ సుందరి వరుసగా బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఎప్పుడూ రెడీ అన్నట్టుగా ఉంటోంది.

అయితే ఈ మధ్య కాలంలో ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన షోల వివారాలతో పాటు గ్లామరెస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాకరేపుతోంది. అయితే గత కొంతకాలంగా సరైనా మూవీస్ ఆఫర్స్ అందుకోని రష్మి..రీసెంట్ గా ఓ అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు .

ఈ సినిమాలో రష్మి ఓ ఐటెం సాంగ్ చేయనుంది అంటూ వార్త్లు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ ని శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలౌస్తుంది. ఇక ఈ పాట ఫుల్ మాస్ బీట్ తో దుమ్మురేపేలా ఉంటుందట. స్టెప్స్ కూడా దే తరహాలో ప్లాన్ చేస్తున్నారట శేఖర్‌ మాస్టర్‌. మెగాస్టార్‌ మాస్ స్టెప్స్ అంటే అభిమానులకు ఎలాంటి ఊపు వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక చిరంజీవ్తో రష్మీ కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. మరి చూడాలి ఈ సినిమాతోనైనా రష్మీ కి మంచి అవకాశాలు వస్తాయి ఏమో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news