జబర్దస్త్ బ్యూటీ రష్మీ అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెరను కూడా షేక్ చేసేస్తోంది. బుల్లితెరపై జబర్దస్త్ షో అవ్వొచ్చు.. ఇంకోటి అవ్వొచ్చు.. ఏ షో అయినా రష్మి ఉంటే రికార్డు టీఆర్పీలు రావాల్సిందే. బుల్లితెరకు కూడా హాట్ ఇమేజ్ ఇవ్వొచ్చు.. అని ఫ్రూవ్ చేసిన ఒకరిద్దరు యాంకరమ్మలలో రష్మీ ఒకరు. అటు ఎన్నో టాప్ బిజినెస్ బ్రాండ్స్‌కు కూడా ఆమె ప్రమోట్ చేస్తోంది.
ఈ క్రమంలోనే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన రష్మి గుంటూరు టాకీస్ సినిమాతో తొలి హిట్ కొట్టింది. బుల్లితెర అయినా, వెండి తెర అయినా రష్మీ అందాలు చూసేందుకు కుర్రకారు ఎంతలా ఎగబడతారో చెప్పక్కర్లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే చిరు హీరోగా తెరకెక్కే భోళా శంకర్ సినిమాలో రష్మీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించబోతోందని.. చిరుయే స్వయంగా ఆమెను సజెస్ట్ చేశారని కూడా ప్రచారం జరుగుతుండడం రష్మీకి మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
ఇక బుల్లితెరపై సుధీర్ – రష్మీ జోడీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఎన్నో షోలు, ఈవెంట్లతో వీరు బుల్లితెరను కుమ్మిపడేస్తూ ఉంటారు. తాజాగా ఢీ షో సెమీఫైనల్స్‌కు మంచు లక్ష్మీ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రదీప్ గుంటూరు టాకీస్ పార్ట్ 2 రష్మీ, సుధీర్ చేస్తే ఎలా ఉంటుందో ? అని అడుగుతాడు. స్కిట్లో రష్మీ, సుధీర్ చొక్కా పట్టుకుని.. కన్ను కొడుతూ కోరుకున్న వాడు కన్నా.. ఏరుకున్న వాడే బాగున్నాడు అంటూ హైపర్ ఆదీ చెప్పమన్న డైలాగ్ చెపుతారు. ఆ తర్వాత సుధీర్ ఏరుకోవడం స్టార్ట్ చేస్తే మా కన్నా బాగా ఎవ్వరూ ఏరుకోలేరు అంటూ నవ్వించాడు.