దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఇండియన్ స్టార్ డైరెక్టర్. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌లోనే యంగ్ స్టార్ హీరోలుగా ఉన్న రామ్‌చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గ్లింప్స్ చూస్తుంటే రాజమౌళి నుంచి మరో బాహుబలి రాబోతోందా ? అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో స్టార్ట్ అయ్యాయి. ఇక రాజమౌళి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్. ఆయన దగ్గరే ఎక్కువ రోజులు పని చేసి రచన, దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. తాను దర్శకుడిని అవ్వాలని చాలా నమ్మకంతో ఉండేవాడిని అని.. మధ్యలో ఓ సారి ఆ నమ్మకం పోయిందని.. సంపాదించాలి అంటే ఏం చేయాలని అనుకునేవాడిని అని చెప్పారు.
తనకు భార్యను చూస్తే ఎంతో ప్రేమ కలుగుతుందని.. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె తనను పోషించిందని చెప్పాడు. ఆ సమయంలో ఉదయం తాను భార్యను ఆఫీస్ దగ్గర డ్రాఫ్ చేసి.. సాయంత్రం తిరిగి తాను ఇంటికి తీసుకు వచ్చేవాడిని అని చెప్పారు. ఇలా చెప్పడానికి తాను సిగ్గుపడడం లేదని.. సంతోషంగా ఉన్నానని కూడా రాజమౌళి చెప్పాడు. ఇక రాజమౌళి – రమాలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే.