Moviesహై ఓల్టేజ్ మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఎన్టీఆర్-రామ్‌చ‌ర‌ణ్..ఖచ్చితంగా చూడాల్సిందే ..!!

హై ఓల్టేజ్ మాస్ స్టెప్పులతో ఇరగదీసిన ఎన్టీఆర్-రామ్‌చ‌ర‌ణ్..ఖచ్చితంగా చూడాల్సిందే ..!!

దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతిష్టాతంక చిత్రం RRR. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. గోండు వీరుడు కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థతో 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. నాలుగు వంద‌ల కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానంటేలా చేసింది.

ఇండియన్‌ మోస్ట్ ప్రస్టీజియస్‌ మూవీ ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుండ‌గా.. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు జరుపుతున్నారు రాజమౌళి. సినిమా గురించి ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా రిలీజ్ కు ముందే ట్రైలర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన దోస్తీ అనే సాంగ్ కు మాంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ చేసారు. నాటు నాటు అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని నవంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు .

అయితే తాజాగా నాటునాటు సాంగ్ ప్రోమో విడుద‌ల చేసారు. నా పాట సూడు వీర నాటు నాటు.. అంటూ సాగనున్న ఈ పాట‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్టైలిష్ డ్రెస్సుల‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ క్లాస్ లుక్ లో మాస్ స్టెప్పులు వేస్తున్న‌ట్టుగా వీడియోని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. నవంబ‌ర్ 10వ తేదీన సాయంత్రం 4 గంటల‌కు ఫుల్ సాంగ్ విడుద‌ల కానుంది. స్టైలిష్ లుక్‌లో మాస్ స్టెప్స్‌తో ఈ ఇద్ద‌రు హీరోలు ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వెండితెర‌పై వీరిద్ద‌రు చేసే ర‌చ్చ‌కి బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయం అని అంటున్నారు అభిమానులు. హై ఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్‌ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటను విడుదల చేయ‌నుండ‌గా, తెలుగులో ‘నాటు నాటు’ అంటూ ఆ పాట సాగనుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, మరకతమణి కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news