దివంగత విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగు సినిమా రంగంలోనే కాకుండా.. రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఎన్టీఆర్ సినిమా పరంగా చూస్తే ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఆ పాత్రలతోనే చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు తెలుగు సినీ అభిమానులు ఓ రాముడిని, ఓ కృష్ణుడిని చూడాలనుకున్నా ఎన్టీఆరే గుర్తుకు వస్తారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్టార్ ఇండస్ట్రీగా ఎదగడంలో ఎంతో కృషి చేశారు.
ఇక ఎన్టీఆర్‌కు మరో దిగ్గజ నటుడు అయిన కత్తి కాంతారావు అంటే ఎంతో అభిమానం. ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘీక పాత్రలకు ఎన్టీఆరే స్వయంగా కాంతారావును రికమెండ్ చేసేవారట. ఒక సినిమా కోసం ఎన్టీఆర్ కాంతారావును తీసుకునేందుకు తన బెస్ట్‌ఫ్రెండ్‌నే కాదనుకున్న సందర్భం కూడా ఉందట. లవకుశ సినిమాలో లక్ష్మణుడు పాత్రకు ముందుగా వేరే వారిని అనుకున్నారట. అయితే కాంతారావు అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడని ఎన్టీఆర్ చెప్పారట. ఒకానొక దశలో కాంతారావుకు అవకాశాలు రానప్పుడు కూడా ఎన్నో అవకాశాలు వచ్చేలా ఎన్టీఆర్ సాయం చేశారట.
ఇక ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ జయసింహ సినిమాలో తన తమ్ముడు పాత్ర కోసం కాంతారావును ఎన్టీఆరే రికమెండ్ చేశారట. ఇక ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు జగ్గయ్య , ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అట. అయితే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక మాత్రం కాంతారావునే బాగా ఎంకరేజ్ చేసేవారట. అయితే కాంతారావు తనకు తెలియకుండానే ఏఎన్నార్ రహస్యం సినిమాలో నటించడంతో కాస్త గ్యాప్ వచ్చిందని.. తర్వాత మళ్లీ ఎంతో సన్నిహితులు అయిపోయారని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు చెపుతారు.